News April 21, 2024
నల్గొండ జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళిక ఖరారు

వచ్చే వానాకాలం-2024 సీజన్ పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. ఈ వానాకాలం సీజన్లో మొత్తం 11,47,954 ఎకరాల్లో వివిధ పంటల సాగుకు ప్రణాళికను ఖరారు చేసింది. అందు లో వరి 5,19,160 ఎకరాలు, పత్తి 5.40లక్షల ఎకరాలు, కంది 4,710, పెసర 1,468, మినుములు 946, జొన్న 185, నువ్వులు 35, వేరుశనగ 1,145, జనుము 56,030, జీలుగ 15,440, పిల్లిపెసర 8,835 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది.
Similar News
News December 11, 2025
హైదరాబాద్ జట్టును ఓడించిన నల్గొండ టీం

వనపర్తిలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 రాష్ట్ర స్థాయి హాకీ బాలుర పోటీలలో నల్గొండ జిల్లా జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో హైదరాబాద్ జట్టును 3-2 గోల్స్ తేడాతో ఓడించింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో నల్గొండ జట్టు మహబూబ్‌నగర్ జట్టుతో తలపడనుంది. జట్టు ప్రదర్శన పట్ల కార్యదర్శి విమల, హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమామ్ కరీం హర్షం వ్యక్తం చేశారు.
News December 11, 2025
MGUకి 500 కోట్లు మంజూరు చేయాలని విద్యార్థుల డిమాండ్

మహాత్మా గాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి 500 కోట్లు మంజూరు చేయాలని గురువారం విద్యార్థులు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం ప్రకటించిన 1000 కోట్లు స్వాగతించదగ్గదేనిగానీ, ఎంజియు 20 ఏళ్లుగా పీజీ సెంటర్ స్థాయిలోనే ఉందని పేర్కొన్నారు. సిబ్బంది కొరత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దుర్దశ, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల భారీ ఫీజులు, పరిశోధనలో వెనుకబాటు సమస్యలను పరిష్కరించాలని అన్నారు.
News December 11, 2025
BREAKING.. ఎల్లమ్మగూడెం సర్పంచ్‌గా వాణి సందీప్ రెడ్డి

తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన ఊట్కూరి వాణి సందీప్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ బలపరిచిన మామిడి నాగలక్ష్మిపై 459 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఘన విజయంతో సర్పంచ్ మద్దతుదారులు గ్రామంలో బాణసంచా కాల్చి, డప్పుల మోతతో సంబరాలు నిర్వహించారు.


