News November 19, 2025

నల్గొండ: తరుగు పేరిట దోపిడీ.. ఏదీ నిఘా?!

image

అష్టకష్టాలు పడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు అమ్మకానికి తీసుకెళ్తే.. రైతుల దోపిడీకి గురవుతున్నారు. మిల్లర్లు క్వింటాల్‌కు 3 కేజీల తరుగు తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. చర్లపల్లికి చెందిన K.లింగారెడ్డి అనే రైతు ఇటీవల అదే గ్రామంలోని హాకా కేంద్రంలో ధాన్యం విక్రయిస్తే 140 బస్తాలు అమ్మగా సెంటర్ నిర్వాహకులు రికార్డులో నమోదు చేశారు. మిల్లు నుంచి వచ్చే తక్ పట్టీలో 137 బస్తాలు మాత్రమే ఉంది.

Similar News

News January 17, 2026

DRDOలో JRF, RA పోస్టులు

image

<>DRDO<<>>కు చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ & స్టోర్స్ రీసెర్చ్& డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DMSRDE) 3 పోస్టులను భర్తీ చేయనుంది. PhD(కెమిస్ట్రీ), పీజీ, బీఈ, బీటెక్/ ఎంఈ, ఎంటెక్, NET, GATE అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 12న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. JRFకు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా, రీసెర్చ్ అసోసియేట్‌కు 35ఏళ్లు. RAకు స్టైపెండ్ నెలకు రూ.67వేలు, JRFకు 37వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.drdo.gov.in

News January 17, 2026

ఏలూరు: రైలు ఢీకొని మహిళ మృతి

image

ఏలూరు నగరంలోని రామకృష్ణపురం వద్ద రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వివాహిత మృతి చెందింది. మృతురాలిని గొల్లగూడెంకు చెందిన ఐ.ప్రియాంక(27)గా గుర్తించారు. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరగగా.. వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. మృతురాలికి ఇద్దరు సంతానం. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 17, 2026

సౌదీ అరేబియాలో అరుదైన చిరుతల మమ్మీలు

image

నార్తర్న్ సౌదీ అరేబియాలోని గుహల్లో అరుదైన చిరుతల అవశేషాల(మమ్మీలు)ను అధికారులు గుర్తించారు. 130 నుంచి 1800ఏళ్ల మధ్య కాలం నాటివి అని రీసెర్చర్లు చెప్పారు. అరార్ సిటీకి సమీపంలో 54 చిరుతల ఎముకలతోపాటు ఏడు చీతా మమ్మీలను కనుగొన్నారు. క్లౌడీ కళ్లు, శరీర అవయవాలు ఎండిపోయినట్టు ఆ చిరుతల మృతదేహాలు ఉన్నాయి. ఎడారులు, హిమానీనదాలు, చిత్తడి నేలల్లో మమ్మిఫికేషన్ నేచురల్‌గా జరుగుతుందని అంచనా వేస్తున్నారు.