News December 2, 2025

నల్గొండ: పవన్ కళ్యాణ్ SORRY చెప్పాలి: కోమటిరెడ్డి

image

తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచేలా పవన్‌ కళ్యాణ్ మాట్లాడారని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. పవన్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారో, తెలియక మాట్లాడారో తనకు తెలియదన్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే, తెలంగాణలో ఆయన సినిమాలు ఆడబోవని మంత్రి హెచ్చరించారు.

Similar News

News February 10, 2026

ఇండియా-పాక్ మ్యాచ్.. విమాన టికెట్లకు రెక్కలు

image

T20 ప్రపంచకప్‌లో ఇండియాతో మ్యాచ్ విషయంలో <<19097488>>పాక్ యూటర్న్<<>> తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగనున్న కొలంబోకు విమాన టికెట్ల ధరలు భారీగా ఎగిశాయి. ఇండియాతో ఆడతామని పాక్ ప్రకటించిన నిమిషాల్లోనే ఏకంగా రూ.10 వేలు పెరిగాయని సమాచారం. ప్రస్తుతం పోను రాను టికెట్ ధర రూ.60 వేలుగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌కు ఇంకా 5 రోజులుండటంతో ఈ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.

News February 10, 2026

KNR: తుది దశకు చేరిన మున్సిపల్ ‘పోరు’

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సెగ క్లైమాక్స్‌కి చేరింది. ప్రధాన పార్టీలైనా BRS, BJP, కాంగ్రెస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని, బీజేపీ గెలిస్తేనే కేంద్రం నుంచి అధికంగా నిధులు వస్తాయని, పదేళ్లలో బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందని బీఆర్ఎస్‌ను గెలిపించాలని ఆపార్టీల నేతలు చెబుతున్నారు. చివరికి ఓటర్లు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో వేచి చూడలి.

News February 10, 2026

HYDలో 3 కమిషనరేట్లు CONFIRM.. నంబర్లు ఇవే!

image

GHMCలో పాలనను పరుగులు పెట్టించేందుకు ప్రవేశపెట్టిన 3 ప్రధాన కమిషనరేట్ల ప్రతిపాదన అధికారికంగా ఖరారైంది. ఆర్వీ.కర్ణన్, టీ.వినయ్ కృష్ణారెడ్డి, జీ.సృజన నేతృత్వంలో జోన్లు, సర్కిళ్లు విడిపోయాయి. మొత్తం 12 జోన్లు, 60 సర్కిళ్ల పరిధిలోని జడ్సీలు, డిప్యూటీ కమిషనర్ల ఫోన్ నంబర్లతో కూడిన జాబితా విడుదలైంది. మహానగరం 3 ముక్కలై.. అతిపెద్ద కార్పొరేషన్‌గా అవతరించింది. పైన ఫొటోలో నంబర్లు ఉన్నాయి. #SAVE IT.