News December 1, 2025
నల్గొండ: పార్లమెంటులో సమస్యలపై గళమెత్తాలి..!

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిసెంబర్ 19 వరకు జరిగే సమావేశాల్లో నియోజకవర్గాలలోని సమస్యలపై ఎంపీలు మాట్లాడి పరిష్కారం దిశగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News February 18, 2026
నల్గొండ: ఇంటర్ పరీక్షలకు సిద్ధం

నల్గొండ జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల కోసం విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయగా, మొత్తం 27,018 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
News February 18, 2026
నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు బదిలీ..!

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసఫ్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈయన అల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పటి వరకు ఇక్కడ ప్రకాశం జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఇన్‌ఛార్జ్‌గా కొనసాగనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో రవి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
News February 18, 2026
ఖమ్మం: జేఈఈ మెయిన్స్‌లో కృష్ణవేణి అకాడమీ జోరు

జేఈఈ మెయిన్స్ సెషన్-1 ఫలితాల్లో కృష్ణవేణి ఐఐటీ & మెడికల్ అకాడమీ విద్యార్థులు ఘనవిజయం సాధించారు. శిశిర్ సాయి 99.91, హర్షిత్ 99.79, లక్ష్మి 99.72, మోక్షిత్ సాయి 99.68, చరణ్ తేజ్99.11, వెంకటేశ్వర్లు 99.01 పర్సంటైల్ సాధించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. డైరెక్టర్ గొల్లపూడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వర విద్యార్థులను అభినందించారు.


