News February 15, 2025
నల్గొండ: పురుగుమందు తాగి వివాహిత సూసైడ్

మునుగోడు మండలం ఉకొండిలో కుటుంబ కలహాలతో వివాహిత పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన నిమ్మల మానస(28), భర్త నగేష్ మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. నగేష్ శుక్రవారం మునుగోడుకు వెళ్లి తిరిగి వచ్చే సరికి మానస పురుగు మందు సేవించి వాంతులు చేసుకుంది. చికిత్స కోసం నల్గొండ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు.
Similar News
News March 9, 2026
నల్గొండ: మార్చి 10 నుంచి పశువులకు టీకాలు

నల్గొండ జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి (FMD) నివారణకు మార్చి 10 నుంచి ఏప్రిల్ 9 వరకు ప్రత్యేక టీకా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ జి.వి. రమేష్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల పశువులకు టీకాలు వేసేందుకు 80 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామాల వారీగా జరిగే ఈ ఉచిత టీకా కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News March 9, 2026
వచ్చిన నీరు వచ్చినట్టే పాయే.. గొంతు ఎండనుందా!

ఈ ఏడాది వేసవి కాలం జిల్లా ప్రజలకు చుక్కలు చూపించేలా ఉంది. ముఖ్యంగా తాగునీటి విషయంలో గండం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి లభ్యత ఆశాజనకంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ నెల నుంచి జూన్ వరకు తాగునీటి అవసరాలకే సుమారు 65.49 టీఎంసీలు అవసరం కాగా, నిల్వలు మాత్రం కనిష్ఠ స్థాయికి చేరువలో ఉన్నాయి.
News March 9, 2026
నల్గొండ: పల్లె వనాలు ఆహ్లాదకరంగా ఉండాలి: కలెక్టర్

గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం చందనపల్లిలోని ప్రకృతి వనం, డంపింగ్ యార్డును ఆయన తనిఖీ చేశారు. వనాల్లో నీడనిచ్చే చెట్లతో పాటు రంగురంగుల పూల మొక్కలను పెంచాలని, ప్రజలు, పిల్లలు సేదతీరేలా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు. పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


