News August 13, 2025
నల్గొండ: పోక్సో నిందితుడికి జీవిత ఖైదు

నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువడించింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోక్సో నిందితుడు గ్యారాల శివకుమార్‌కి జీవిత ఖైదీ విధిస్తూ బుధవారం మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. 2023లో మైనర్ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకొని అత్యాచారం చేశాడనే ఆరోపణపై శివకుమార్‌పై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది.
Similar News
News March 15, 2026
జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ బి.చంద్ర శేఖర్

అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల వాణిజ్య గ్యాస్ నిల్వలు తగ్గినప్పటికీ, జిల్లాలో గృహ అవసరాల (Domestic) గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేదని కలెక్టర్ బి.చంద్ర శేఖర్ స్పష్టం చేశారు. శనివారం నిర్వహించిన “జిల్లా స్థాయి ఇంధన సరఫరా పర్యవేక్షణ కమిటీ” సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి గ్యాస్ కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News March 14, 2026
NLG జిల్లావ్యాప్తంగా 37 మంది గైర్హాజరు

జిల్లా వ్యాప్తంగా 106 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి తెలుగు పరీక్ష సుజావుగా జరిగినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. 19,672 మంది విద్యార్థులకు గాను, 19,635 మంది విద్యార్థులు హాజరై 37 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. వీరిలో ముగ్గురు ప్రైవేటు విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. కలెక్టర్ బి. చంద్రశేఖర్ నాలుగు సెంటర్లను తనిఖీ చేశారని చెప్పారు.