News November 19, 2025
నల్గొండ: బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్

2025 -26 విద్యా సంవత్సరానికి గాను ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల నమోదు కోసం జిల్లాలోని GHS, ZPHS, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న అర్హులైన BC, EBC విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజకుమార్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు DEC 15 లోపు https://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Similar News
News January 23, 2026
NLG: మూగజీవాల దాహార్తిని తీర్చాలి: కలెక్టర్

వేసవిలో జంతువుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన SPCA సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎండల దృష్ట్యా పట్టణాలు, గ్రామాల్లో జంతువుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. ఆవుల దత్తతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, పశువులకు నీడ, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. అనంతరం గ్రామీణ పశు వైద్యులకు ఎండోస్కోప్ కిట్లను పంపిణీ చేసారు.
News January 23, 2026
నల్గొండ : M.B.A , M.C.A ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల..

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ ,ఎంసీఏ సెమిస్టర్-1 రెగ్యులర్ కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్. ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 23 మధ్య పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.
News January 22, 2026
నల్గొండ : పీజీ సెమిస్టర్-1 పరీక్షల షెడ్యూల్ విడుదల

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో PG ( M.A / M.Sc / M.Com / M.S.W ) సెమిస్టర్-1 రెగ్యులర్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 20 మధ్య పరీక్షలు జరుగుతాయని కంట్రోలర్ అఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్. ఉపేందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష సెంటర్ లోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.


