News August 21, 2025
నల్గొండ: మద్యం మత్తులో యువకుల ఘర్షణ

మద్యం మత్తులో యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కురుమేడలో ఈరోజు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సిట్టింగ్ వేసిన నలుగురు యువకులు మాటామాట పెరిగి, ఒకరిపై ఒకరు బీరు సీసాలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలవగా స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Similar News
News January 20, 2026
ఏలూరు జాతర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: కలెక్టర్

ఏలూరులో జాతర మహోత్సవాల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. జేబుదొంగలు, ఆకతాయిల కదలికలపై నిఘా ఉంచాలని, భద్రత విషయంలో రాజీ పడకూడదని పోలీసు శాఖకు స్పష్టం చేశారు.
News January 20, 2026
పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దు: హైకోర్టు

TG: చలాన్ల వసూలుపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దని, బైక్ కీస్ లాక్కోవడం, బండిని సీజ్ చేయడం లాంటివి చేయొద్దని పోలీసులను ఆదేశించింది. వాహనదారుడు స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలని సూచించింది. లేకుంటే నోటీసులు ఇవ్వాలని తెలిపింది. న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.
News January 20, 2026
మెరుగైన శిక్షణతో విధుల్లో మరింత రాణించగలం: వరంగల్ సీపీ

పోలీస్ అధికారులు, సిబ్బంది మెరుగైన శిక్షణ పూర్తి చేయడం ద్వారా అప్పగించిన పనుల్లో మరింత రాణించగలమని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఆర్మూడ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శివ కుమార్ హైదరాబాద్ యూసుఫ్‌గూడలో నిర్వహించిన ఆరు నెలల ఆయుధ మరమ్మతులపై శిక్షణ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేయడంతో శిక్షణా కేంద్రం నుంచి జారీ చేసిన ధ్రువ పత్రాన్ని శివకుమార్‌కు సీపీ అందజేశారు.


