News May 7, 2025
నల్గొండ: విషాదం.. రోడ్డు ప్రమాదంలో స్నేహితులు మృతి

నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండిలో <<16216733>>తీవ్రవిషాదం<<>> చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బింగి మత్స్యగిరి (20), మర్రి శివకుమార్(21) ఇద్దరు స్నేహితులు బైక్‌పై వెళ్తూ స్తంభానికి డీకొట్టారు. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామంలో స్నేహితుని వివాహం సందర్భంగా వచ్చి మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలాన్ని మునుగోడు ఎస్ఐ రవి సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News February 18, 2026
రైతుల సాగు వివరాలు నమోదు చేయాలి: కలెక్టర్

రైతుల పంటల సాగును ఏఈఓలు సందర్శించి సర్వే నంబర్ల వారీగా పంటల వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనురాధతో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులతో ఫార్మర్ రిజస్టరీ, క్రాప్ బుకింగ్, యూరియా నిల్వలు, రైతుబీమాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏఈఓలు వారి పరిధిలోని గ్రామాలలో రైతుల రిజిస్టర్‌కు సంబంధించి ఐడి క్రియేట్ చేయాలన్నారు.
News February 18, 2026
మరోసారి భారత్ vs పాక్?

పాకిస్థాన్ సూపర్-8కు క్వాలిఫై కావడంతో T20WCలో మరోసారి భారత్‌తో తలపడే అవకాశం ఉంది. భారత్ గ్రూప్-1, పాక్ గ్రూప్-2లో ఉండటం వల్ల సూపర్-8లో అది సాధ్యం కాదు. కానీ సూపర్-8లో గ్రూప్-1లో భారత్ ఫస్ట్, గ్రూప్-2లో పాక్ సెకండ్ వస్తే సెమీస్‌లో తలపడొచ్చు. భారత్ సెకండ్, పాక్ ఫస్ట్ వచ్చినా సాధ్యమే. ఒకవేళ రెండు జట్లు వేర్వేరు సెమీస్‌లో నెగ్గితే కొలంబో వేదికగా IND vs PAK ఫైనల్ చూసే ఛాన్స్ ఉంటుంది.
News February 18, 2026
పిల్లలు వద్దు బొమ్మలే ముద్దు అంటున్న చైనా జెన్‌జీ

జననాల రేటు తగ్గిపోతున్న చైనాలో జెన్‌జీ మహిళలు పిల్లల కంటే బొమ్మలే మేలంటున్నారు. తమకు నచ్చిన బొమ్మను డిజైన్ చేయించుకుని దానినే తమ బిడ్డగా లాలించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని భావిస్తున్నారు. పిల్లలను 18ఏళ్ల వరకు పెంచేందుకు దాదాపు రెండున్నర లక్షల డాలర్లపైనే అవుతుందని.. అదే బొమ్మ అయితే 200-800 డాలర్లలో దొరికేస్తుందని అంటున్నారు. దీని వల్ల తమ కెరీర్‌కు కూడా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.


