News February 6, 2025

నల్గొండ: శుభకార్యాలకు అద్దెకు ఆర్టీసీ బస్సులు

image

TGS RTC నల్గొండ రీజియన్‌లోని అన్ని డిపోలలో వివాహాది శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన బస్సులు అందజేస్తామని ఉమ్మడి నల్గొండ జిల్లా రీజనల్ మేనేజర్ కె. జానీ రెడ్డి తెలిపారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను అద్దెకు తీసుకోవచ్చున్నారు. ప్రతి కిలోమీటర్‌పై గతంలో కంటే రూ.7 తగ్గింపు ఉందని, 6 గంటల వెయిటింగ్ చార్జ్ మినహాయింపు ఉంటుందన్నారు. వివరాలకు సమీప డిపోలను సంప్రదించాలని సూచించారు.

Similar News

News January 21, 2026

NLG: జిల్లా కారాగారానికి నూతన సూపరింటెండెంట్‌

image

నల్గొండ జిల్లా కారాగారానికి నూతన సూపరింటెండెంట్‌గా కె. ఆనందరావు నియమితులయ్యారు. గత సూపరింటెండెంట్ పదోన్నతిపై చర్లపల్లి కేంద్ర కారాగారానికి బదిలీ అయ్యారు. కె.ఆనందరావు గతంలో కేంద్ర కారాగారం నిజామాబాద్‌లో విధులు నిర్వహించారు. పరిపాలనా అనుభవం కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన ఆయన నల్గొండ జిల్లా కారాగార అభివృద్ధికి కృషి చేస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News January 21, 2026

NLG: వేసవిలో దాహార్తి తీర్చేలా ముందస్తు ప్రణాళిక

image

జిల్లాలోని ప్రతి పల్లెకూ స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యమని అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. రానున్న వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా ‘ప్రత్యేక డ్రైవ్’ చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని బోర్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపులైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.

News January 21, 2026

నల్గొండ: ఉచిత శిక్షణను వినియోగించుకోండి: కలెక్టర్

image

జిల్లా కేంద్రంలో ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్వహించే 5 నెలల ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఫౌండేషన్ కోర్సు కరపత్రాలను కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.