News February 7, 2025
నల్గొండ: 13 మంది 16 సెట్ల నామినేషన్లు..

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 17, 2026
ములుగు: బంపర్ ఆఫర్.. రెడీగా రూ.55 కోట్ల ఫండ్!

సాధారణంగా కొత్త పాలకవర్గాలకు సమస్యలు స్వాగతం పలుకుతాయి. కానీ, ములుగు మున్సిపల్ కార్యవర్గానికి సమస్యలతో పాటు నిధులు వెల్ కమ్ చెబుతున్నాయి. మంత్రి సీతక్క చొరవతో మేజర్ పంచాయతీ హోదాలో మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత మొత్తం రూ.55 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రతీ వార్డులో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి అనేక సమస్యలున్నాయి. వీటిని తీర్చుతూనే ముందుగా కోతుల సమస్యను పరిష్కరించాలని జనం కోరుతున్నారు.
News February 17, 2026
హార్దిక్ పాండ్య ‘రుద్ర’ వాచ్ గురించి తెలుసా?

శివరాత్రి రోజున <<19153355>>పాక్‌తో జరిగిన<<>> మ్యాచ్‌లో భారత ప్లేయర్ హార్దిక్ పాండ్య ధరించిన వాచ్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. జాకబ్ అండ్ కో సంస్థ ‘రుద్ర’ పేరుతో వీటిని తయారు చేస్తోంది. ఒక్కోటి రూ.25 లక్షల వరకు ఉంటుందని, ప్రపంచంలో 25 పీసులే ఉన్నాయని తెలుస్తోంది. వాచ్ డిస్‌ప్లేపై ధ్యానంలో ఉన్న శివుడు, ఓం, గుడి చిత్రాలున్నాయి. 41 MM గ్రేడ్ 5 టైటానియం కేస్‌తో ఇది తయారైంది. 70 గంటలపాటు పవర్ రిజర్వ్ ఉంటుంది.
News February 17, 2026
జగిత్యాల MLAపై ముప్పేటదాడి.. అయినా ధైర్యంగా ముందుకు..!

JGTL MLA సంజయ్‌పై వివిధ పార్టీల నేతలు రోజూ ముప్పేటదాడికి దిగారు. అయినా చలించకుండా తనపని తాను చేసుకుంటూ వెళ్లారు. పార్టీ మారావంటూ, ఎందులో ఉన్నావో చెప్పాలంటూ BRS ఎద్దేవ చేసినా, ఆ పార్టీ MLAలు మా సంసారంలో వేలెందుకు పెడతావన్నా, కాంగ్రెస్ నేతలు అవమానించినా వేరవలేదు. చివరకు కాంగ్రెస్ కౌన్సిలర్ల తరఫున MLA ప్రచారం చేసి తన వర్గాన్ని గెలిపించుకొని మున్సిపల్ ఛైర్మన్ చేసి ప్రత్యర్థులకు గట్టి సమాధానం ఇచ్చారు.


