News March 8, 2025

నల్గొండ: 30 రోజుల్లో 3 వేల బోర్లు!

image

ఓవైపు రోజురోజుకూ పెరుగుతున్న ఎండలు.. మరోవైపు అడుగంటుతున్న జలాశయాలు రైతులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. భూగర్భ జలాలు పడిపోతున్న నేపథ్యంలో నాన్ఆయకట్టులో వరి పంటకు తీవ్ర నీటి ఎద్దడి ఎదురవుతోంది. దీంతో ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు కొత్తగా బోర్లు వేస్తూ భగీరథ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క NLG మండలంలోనే నెల రోజుల్లో 3 వేల వరకు కొత్తగా బోర్లు వేసినట్లు సమాచారం.

Similar News

News February 9, 2026

NLG: మున్సిపల్ పోలింగ్.. రెండు రోజులు సెలవులు: కలెక్టర్

image

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ ఉత్తర్వులు నల్గొండ కార్పొరేషన్‌, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, చండూరు, దేవరకొండ, చిట్యాల మున్సిపాలిటీలకు వర్తిస్తాయని పేర్కొన్నారు.

News February 9, 2026

నల్గొండ: ఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపు

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ పూర్తయింది. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా సాధారణ పరిశీలకులు రమేష్ సమక్షంలో కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న నల్గొండ కార్పొరేషన్ సహా మిర్యాలగూడ, చండూరు వంటి మున్సిపాలిటీల్లోని 475 పోలింగ్ కేంద్రాలకు మొత్తం 2,855 మంది సిబ్బందిని (20% రిజర్వ్‌తో కలిపి) కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.

News February 9, 2026

ఎన్నికలకు సిద్ధం.. సిబ్బంది ఖరారు: కలెక్టర్

image

జిల్లాలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియలో కీలకమైన చివరి విడత ర్యాండమైజేషన్ సోమవారం కలెక్టరేట్‌లో పూర్తయింది. ఎన్నికల సాధారణ పరిశీలకులు రమేష్ సమక్షంలో కలెక్టర్ చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. ​NLG కార్పొరేషన్ సహా MLG, నందికొండ, హలియా, DVK, చండూరు, చిట్యాల పురపాలక సంఘాల్లో 475 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.