News October 8, 2024

నల్లగొండలో రేపు జాబ్ మేళా

image

నల్లగొండలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి 2 గంటల వరకు నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ కంపెనీల్లో విదేశీ ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఉంటాయని పేర్కొన్నారు.

Similar News

News February 9, 2026

మర్రిగూడ: అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

మర్రిగూడ మండలం సరంపేటలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీలోని విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు మెను ప్రకారం పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ టీచర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ నక్క రాములమ్మ, కార్యదర్శి రాకేష్, సిడిపిఓ సక్కుబాయి పాల్గొన్నారు.

News February 9, 2026

NLG: ఎంఈఓలూ.. ఏమిటి నిర్లక్ష్యం!?

image

జిల్లాలో ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడంలో జిల్లా విద్యాశాఖ విఫలమైంది. మొత్తం 3,122 దరఖాస్తుల్లో 2,320 మాత్రమే ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయగా, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయి. చింతపల్లి, చందంపేట, తిప్పర్తి, పెద్దవూర, DVK, CTL, గట్టుప్పల్, NKL తదితర మండలాల్లో రిజిస్ట్రేషన్ శాతం 55.5 నుంచి 88.2 మధ్యలోనే ఉన్నాయి. దీనిపై కలెక్టర్ ఎంఈఓలకు షోకాజ్ నోటీసులు అందజేశారు.

News February 9, 2026

NLG: ఆ పాఠశాలకు ఈ నెల 13 వరకు సెలవు

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా నల్గొండలోని నిడమనూరుకు చెందిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలకు ఈ నెల 11 నుంచి 13 వరకు సెలవును ప్రకటిస్తూ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పాఠశాలలో ఈ నెల 13న DVK, CDR, CTL మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు కౌంటింగ్ కేంద్రంగా ఈ పాఠశాలను ఎంపిక చేశారు.