News December 3, 2025
నవంబర్ అంటే నాకు భయం: రామ్

నవంబర్ అంటే తనకు భయమని హీరో రామ్ అన్నారు. గతంలో ఇదే నెల రిలీజైన ‘మసాలా’కు కలెక్షన్లు రాలేదని చెప్పారు. కానీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’పై ఉన్న నమ్మకంతోనే ఆ భయాన్ని పక్కనపెట్టినట్లు వివరించారు. ఇది గొప్ప సినిమా అని ప్రేక్షకులు వెంటనే తెలుసుకుంటారా? లేట్ అవుతుందా? అనే దానిపై చర్చించుకున్నట్లు చెప్పారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా డే-1లోనే కలెక్షన్లు కొట్టేస్తుందని అనుకోలేదని థ్యాంక్స్ మీట్‌లో తెలిపారు.
Similar News
News February 7, 2026
పెళ్లిళ్లలో సంగీతం వాయించేవాడిని: అనిరుధ్

ఒక్కో సినిమాకు రూ.కోట్లు తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తన చిన్నతనంలో పెళ్లి వేడుకల్లో సంగీతం వాయించేవారు. అప్పుడు తనకు రూ.500 ఇచ్చేవారని, కొన్నిసార్లు తాంబూలం ఇచ్చి పంపేవారని ఆయన ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘ఆ తక్కువ డబ్బుతో పొందిన సంతోషం ఇప్పుడు రూ.కోట్లు వస్తున్నా కలగడం లేదు’ అని ఆయన చెప్పుకొచ్చారు. కష్టపడే తత్వం ఉంటే సున్నా నుంచి శిఖరానికి చేరవచ్చని అనిరుధ్ నిరూపించారు.
News February 7, 2026
వంటింటి చిట్కాలు

* పనీర్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. * సింక్ గొట్టంలో ఆహార వ్యర్థాలు ఇరుక్కుపోయి దుర్వాసన వస్తుంటే బేకింగ్ సోడాను వేడినీళ్ళలో కలిపి పోస్తే సమస్య పరిష్కారమవుతుంది. * కొబ్బరిపాలు కొన్ని గంటలపాటు తాజాగా ఉండాలంటే చిటికెడు ఉప్పు కలపండి. * కొత్తిమీర కాడల్ని కత్తిరించి ఆ ఆకులకు నాలుగైదు వరుసల్లో కాగితాలు చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
News February 7, 2026
మలేషియాకు బయలుదేరిన మోదీ

రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ మలేషియా బయలుదేరారు. పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సముద్ర తీర సహకారంపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. అలాగే మలేషియాలోని భారతీయులను ప్రధాని ప్రత్యేకంగా కలవనున్నారు. కాగా మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇది మూడోసారి.


