News August 20, 2024

నవబ్రహ్మ ఆలయాలపై కేంద్ర బృందం రీసర్చ్ !

image

7వ శతాబ్దాలనాటి అలంపూర్ నవబ్రహ్మ ఆలయాలపై ఆర్కియాలజికల్ కేంద్ర అధ్యయన బృందం మంగళవారం అలంపూర్ సందర్శించింది. ఆర్కియాలజికల్ ప్రొఫెసర్ మహాలక్ష్మీ బృందం నవబ్రహ్మ ఆలయాలను సందర్శించి ఇక్కడి అర్కిటెక్చర్, శాసనాలు సంస్కృతి సాంప్రదాయాలపై అధ్యయనం చేశారు. తమ పరిశోధనలో అలంపూర్ ఆలయాలు సంతృప్తినిచ్చాయన్నారు. ఈవో పురేందర్, ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ, జోగుళాంబ సేవాసమితి అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఉన్నారు.

Similar News

News September 18, 2024

MBNR: అరకోరగా సరఫరా అవుతున్న ఔషధాలు !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో టైఫాయిడ్, మలేరియా, డెంగీ, ఇతర విష జ్వరాలతో పాటు జలుబు, దగ్గుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని రకాల ఔషధాలు, అత్యవసర మందులు రోగులకు అందడం లేదు. MBNR- 30, WNP-15, NGKL-35, NRPT-15, GDWL-12 చొప్పున ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ఔషధాలు మాత్రం మహబూబ్ నగర్‌లో ఉన్న ఔషధ నిల్వ కేంద్రం నుంచి అరకోరగా సరఫరా అవుతున్నాయి. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.

News September 18, 2024

ఇంటర్ విద్యలో ఇంచార్జి అధికారులే దిక్కు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటర్ విద్యాశాఖ అనాధగా మారింది. 5 జిల్లాల్లో ఇంటర్ విద్యను పర్యవేక్షించేందుకు శాశ్వత ప్రాతిపదికన జిల్లా ఇంటర్ అధికారులు(DIEO) లేకపోవడంతో ఇన్చార్జులుగా ఉన్నవారు విధులు నిర్వహిస్తున్నారు. వీరు పని చేస్తున్న కళాశాలల్లో ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తూ.. జిల్లా ఇంటర్ అధికారిగా కూడా విధులు నిర్వహించవలసి వస్తుంది. దీంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడింది అనే విమర్శలు ఉన్నాయి.

News September 18, 2024

సగమైన పాలమూరు పెద్ద చెరువు !

image

పాలమూరులో పెద్ద చెరువు 96.11 ఎకరాల్లో విస్తరించి ఉంది. 200 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న ఈ చెరువు అక్రమ నిర్మాణాలతో సగం అయింది. పట్టణం విస్తరిస్తున్న క్రమంలో 1989 నుంచి ఆక్రమణలపై పర్వం ప్రారంభమైంది. దీనిపై ప్రజాసంఘాలు, పౌరసమాజం, ప్రజాప్రతినిధులు అధికారులకు విన్నవించారు. అక్రమణలపై కొందరు న్యాయపోరాటం సైతం చేశారు. తాజాగా 40 ఎకరాల చెరువును 64 మంది ఆక్రమించారని సర్వే విభాగం నిర్ధారించింది.