News January 21, 2026
నవీన్ పొలిశెట్టి కండిషన్స్ నిజమేనా?

హీరో నవీన్ పొలిశెట్టికి సంబంధించి ఓ వార్త వైరలవుతోంది. అదేంటంటే ఆయన కొత్తగా 2 కండిషన్స్ పెడుతున్నారంట. ‘ఒకటి రూ.15 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వాలి. రెండోది మూవీ మొత్తం తానే చూసుకుంటారు’ అని అంటున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంటే నిర్మాత మూవీకి సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకోకూడదు. బడ్జెట్ ఇస్తే ఆఖర్లో ఫస్ట్ కాపీ చూపిస్తారు. అయితే ఈ ప్రచారాల్లో నిజమెంత అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News February 18, 2026
‘హంప్ డే’ గురించి తెలుసా?

ఐదు రోజుల పని వారంలో బుధవారం సరిగ్గా మధ్యలో వస్తుంది. దీనిని ‘హంప్ డే’ అని పిలుస్తారు. ఒంటె మూపురం(హంప్)ను ఎక్కి దిగినట్లుగా బుధవారం దాటితే కష్టమైన పని వారం ముగిసి, వీకెండ్ వైపు ప్రయాణం మొదలైనట్లు ఉద్యోగులు భావిస్తారట. 1950లలో అమెరికాలో పుట్టిన ఈ పదం 2013లో ఒక వాణిజ్య ప్రకటన ద్వారా బాగా పాపులర్ అయ్యింది. దీన్ని సగం కష్టం తీరిందనే సంతోషానికి గుర్తుగా పరిగణిస్తారు.
News February 18, 2026
బామర్ లారీ 28 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

<
News February 18, 2026
వయో వ్రతం ఎలా చేయాలి?

వయో వ్రతం ఫాల్గుణ శుక్ల పక్ష పాడ్యమి నుంచి ద్వాదశి వరకు 12 రోజులు సాగుతుంది. ఈ సమయంలో పాలు మాత్రమే తీసుకుంటారు. అందుకే ‘పయోవ్రతం’ అనే పేరొచ్చిందంటారు. వ్రతంలో భాగంగా సూర్యోదయానికి ముందే స్నానం చేసి, లక్ష్మీనారాయణులను షోడశోపచారాలతో పూజించాలి. బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపై పడుకోవాలి. ద్వాదశి నాడు పూర్ణాహుతితో వ్రతం ముగించాలి. అన్నదానం చేయాలి. నియమ నిష్టలతో చేసే ఈ పూజ అనంత పుణ్యఫలాన్ని ఇస్తుంది.


