News November 7, 2025

నవీన్ యాదవ్‌పై ఈసీకీ బీఅర్ఎస్ ఎంపీల ఫిర్యాదు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం, మంత్రులు, కాంగ్రెస్ నాయకుల కోడ్ ఉల్లంఘించారని ఢిల్లీలోని ఈసీకి BRS MPలు గురువారం ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓట్ల రిగ్గింగ్, దొంగ ఓట్లకు పాల్పడే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపఎన్నిక నేపథ్యంలో తక్షణమే కేంద్ర బలగాల నియమించి, ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

Similar News

News January 19, 2026

‘చైనా ఆస్టర్’ సాగుకు అనువైన వాతావరణం

image

‘చైనా ఆస్టర్’ పువ్వులను కట్‌ఫ్లవర్‌గా, వేడుకల్లో డెకరేషన్ కోసం, పూజా కార్యక్రమాల్లో వాడుతుంటారు. ఈ పువ్వుల సాగుకు మంచి సూర్యరశ్మితో పాటు చల్లని వాతావరణం అవసరం. నీరు బాగా ఇంకే లోతైన ఎర్రగరప నేలలు వీటి సాగుకు అనుకూలం. IIHR బెంగళూరు రూపొందించిన కామిని, వయోలెట్, కుషన్, శశాంక్, అర్చనా, పూర్ణిమ రకాలు అధిక పూల దిగుబడిని అందిస్తాయి. ఈ మొక్కలను నాటిన 70 నుంచి 80 రోజులకు (రకాన్ని బట్టి) పూలు వస్తాయి.

News January 19, 2026

21న తూర్పుగోదావరి జడ్పీ సర్వసభ్య సమావేశం

image

తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 21న నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈవో లక్ష్మణరావు సోమవారం తెలిపారు. రాజమండ్రిలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:15 వరకు ఈ సమావేశం జరుగుతుందని, అనంతరం స్థాయి సంఘాల సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, సభ్యులు, అధికారులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. జిల్లా అభివృద్ధి, సమస్యలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.

News January 19, 2026

‘క్వాంటమ్’ కోర్సులో 50,000 మంది AP యువత

image

AP: క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సుకు రాష్ట్ర యువత నుంచి అధిక స్పందన లభిస్తోంది. NPTEL ప్లాట్‌ఫామ్ ద్వారా మద్రాస్ IIT, IBM అందిస్తున్న ఈ కోర్సులో 50,000 మంది ఎన్రోల్ అయ్యారు. దేశంలోనే AP ఈ అంశంలో ముందంజలో ఉంది. అటు IITల సహకారంతో 7-9 తరగతుల్లో క్వాంటమ్ పరిజ్ఞానంపై అవగాహన పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. ఈకోర్సులో గోల్డ్, సిల్వర్ మెడలిస్టులను సత్కరించనున్నామని CBN Xలో పేర్కొన్నారు.