News March 4, 2025
నవోదయం 2.0పై విస్తృతంగా అవగాహన

నవోదయం 2.0పై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్‌లో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం 2.0 కార్యక్రమానికి సంబంధించిన కళాజాత ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. నాటు సారాను నిర్మూలించడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, నవోదయం 2.0పై నెల రోజులపాటు కళాజాత ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు.
Similar News
News December 17, 2025
బాదనహాల్ రైల్వే స్టేషన్ ప్రారంభం

డి.హిరేహాల్ మండలం బాదనహాల్ రైల్వే స్టేషన్‌ను రైల్వే అధికారులు బుధవారం ప్రారంభించారు. రాయదుర్గం -సోమలాపురం రైల్వే స్టేషన్ల మధ్య ఇటీవల కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టారు. మంగళవారం ఈ రూటులో పలు రైళ్లు రద్దు చేసి బాదనహాల్ స్టేషన్‌లో లైన్ మార్పిడి చేశారు. అనంతరం రైలును ఈ ట్రాక్‌పై నడిపి ట్రయల్ రన్ చేశారు. నూతన బిల్డింగ్‌ను ప్రారంభించారు. పలువురు హుబ్లి డివిజన్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.
News December 17, 2025
అనంత: సూరీడు సమయం మారిపోతోంది.!

అనంతపురం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ప్రభావంతో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. దానికి తోడు ఉదయం 8.30 గంటలవుతున్నప్పటికీ పొగ మంచు కప్పి వేయడంతో సూర్య భగవానుడు సైతం కనిపించని పరిస్థితి నెలకొంటుంది. వాహనదారులు పొగ మంచు పూర్తిగా క్లియర్ అయిన తర్వాత ప్రయాణాలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో సూర్యోదయం దృశ్యాలను చూడొచ్చు.
News December 17, 2025
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం

బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి ZP హైస్కూల్ PET జగన్మోహన్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచారు. లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, డిస్కస్ త్రో, 4×100 మీ. రిలే.. ఇలా పాల్గొన్న 4 విభాగాల్లోనూ బంగారు పతకాలు సాధించారు. ఈ ఘనతతో రాజస్థాన్‌లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఆయన ఎంపికయ్యారు. ఆయనను ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు.


