News December 13, 2025

నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జోహార్ నవోదయ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. ఆరో తరగతి ప్రవేశం కోసం ఈ పరీక్షను నిర్వహించారు. జిల్లాలో మొత్తం 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6,469 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, 4,548 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వివరించారు.

Similar News

News January 23, 2026

నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణపై కలెక్టర్ ఆదేశం

image

నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ, అప్రెంటీస్‌షిప్ అవకాశాలు పెంచాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఏపీఎస్‌ఎస్‌డీసీ వంటి సంస్థలను 100 శాతం వినియోగించుకోవాలని సూచించారు. నిరుద్యోగులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణలు ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేయాలన్నారు. కోర్సులు పూర్తి చేసిన వారికి తక్షణమే ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

News January 23, 2026

అంగన్‌వాడీ సేవలు మెరుగుపరచాలి: కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ డా.సిరి సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పిల్లలకు మెరుగైన సేవలందించాలని అధికారులను ఆదేశించారు. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని స్పష్టం చేశారు. పథకాల అమలులో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

News January 23, 2026

ఫిబ్రవరి నాటికి పనులు ప్రారంభం కావాలి: కలెక్టర్

image

పెండింగ్‌లో ఉన్న పీఎం కుసుమ్ పనులను ఫిబ్రవరి మొదటి వారం నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సిరి విద్యుత్ శాఖ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కాంట్రాక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ఏప్రిల్ నాటికి 23,000 సోలార్ ఇన్‌స్టాలేషన్లను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు.