News August 11, 2025
నస్పూర్: ‘అవకతవకలపై విచారణ చేపట్టాలి’

నస్పూర్ శివారు సర్వే నంబర్ 42లో TNGO ప్లాట్లలో జరుగుతున్న అవకతవకలపై తగిన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని BSP నాయకులు కోరారు. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కుమారు దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజలకు చెందాల్సిన భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లకు నిలయంగా మారుతున్నాయని రవీందర్, రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయానికి కూత వేట దూరంలో జరుగుతున్న దానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News March 13, 2026
నెల్లూరు జిల్లాలో గ్యాస్ కొరత.. JC క్లారిటీ

నెల్లూరు జిల్లాలో గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను ప్రజలు ఎవరూ నమ్మవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గృహ వినియోగానికి సరిపడా LPG సిలిండర్లు నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని భరోసా ఇచ్చారు.
News March 13, 2026
మూడో రోజూ బ్లడ్‌బాత్.. భారీ నష్టాలు

యుద్ధ భయాలు, గ్యాస్ కొరత నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఏకంగా 488(2.06) పాయింట్లు కోల్పోయి 23,151 వద్ద, సెన్సెక్స్ 1,470(1.93) పాయింట్లు నష్టపోయి 74,563 వద్ద ముగిశాయి. నిఫ్టీ మూడు రోజుల్లో సుమారు 1,100 పాయింట్లు కోల్పోవడం గమనార్హం. L&T(7.38%), టాటా స్టీల్(5.3%), ఎస్బీఐ(3.7%), బెల్(3%), మారుతి(3%) షేర్లు భారీగా నష్టపోయాయి.
News March 13, 2026
ఆ పథకంతో 17 వేల మందికి ఉపాధి: మంత్రి

AP: ‘సీఎం ఉపాధి సృష్టి’ పథకం ద్వారా ₹300Crతో 3,500 సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థికసాయం చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. దీని ద్వారా 17 వేల మందికి ఉపాధి లభించనుందన్నారు. ఇక APSP బెటాలియన్లలో 300 హెడ్ కానిస్టేబుల్స్ పోస్టుల్ని అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసేందుకు, నీరుకొండలో తెలుగు కల్చరల్ సెంటర్‌కు ₹119.27Cr మంజూరుకు ప్రతిపాదించామన్నారు.


