News August 22, 2025

నాందేడ్-ధర్మవరం రైలు దారి మళ్లింపు

image

నంద్యాల మీదుగా నడుస్తున్న నాందేడ్-ధర్మవరం రైలును రైల్వే అధికారులు దారి మళ్లించారు. నాందేడ్-ధర్మవరం-నాందేడ్ (07189/07190) ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును సెప్టెంబర్ నుంచి నల్గొండ-నంద్యాల-కడప మార్గానికి బదులుగా.. కరీంనగర్-వరంగల్-నెల్లూరు మీదుగా నడవనుంది. ఈ నిర్ణయం పట్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 24, 2026

గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

*గద్వాల: మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
*రేపు పలు కాలనీలకు పవర్ కట్
*వేరుశనగకు రికార్డ్ ధర రూ.9,389
*అలంపూర్: సీఐగా ప్రదీప్ కుమార్
*శక్తిపీఠంలో భక్తుల సందడి
*అయిజ: బాల్యవివాహాలు భవిష్యత్తుకు అడ్డంకులు
*మానవపాడు: లైన్మెన్‌ను నియమించాలని వినతి
*ఎర్రవల్లి: అక్రమ చేపల చెరువులపై చర్యలు తీసుకోవాలి
*కేటిదొడ్డి: గణతంత్ర వేడుకలకు పాఠశాలలు ముస్తాబు
*ధరూర్: కనులపండువగా అంజన్న రథోత్సవం

News January 24, 2026

రామభద్రపురంలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

రామభద్రపురంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బొబ్బిలి మండలం కమ్మవలసకు చెందిన రాము రామభద్రపురం నుంచి బొబ్బిలి వైపు బైక్ పై వెళ్తుండగా.. రామభద్రపురం వైపు వస్తున్న బొలెరో చిన్నమ్మ తల్లి ఆలయం వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాము తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

News January 24, 2026

హైకోర్టులే ప్రాథమిక సంరక్షకులు: సీజేఐ సూర్యకాంత్

image

సాధారణ ప్రజలకు న్యాయం అందించడంలో హైకోర్టుల పాత్ర అత్యంత కీలకమని CJI జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఇవి ప్రాథమిక సంరక్షకులుగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. న్యాయం ప్రజలకు దూరమైన భావన రాకుండా చేయడంలో వీటి పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. HCలు కేవలం అప్పీల్/రివిజన్ కోర్టులుగా కాకుండా, రాజ్యాంగ పరిరక్షణకు అందుబాటులో ఉండే కేంద్రాలుగా మారాలన్నారు. నేరుగా SCను ఆశ్రయించడాన్ని తాను వ్యతిరేకిస్తానన్నారు.