News November 19, 2025

నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

image

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.

Similar News

News January 18, 2026

అనంతపురం: 19న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

అనంతపురం జిల్లా ప్రజలు 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచించారు. ఈనెల 19న కలెక్టరేట్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్జీదారులు meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

News January 18, 2026

మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి జీవన్ రెడ్డికి షాక్

image

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికల వేళ ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే నాయకులంతా వరుసగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గంలో చేరిపోతుండగా, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతిలు ఎమ్మెల్యే వద్దకు చేరారు. తాజాగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భీరం రాజేష్, యూత్ నాయకులు కచ్చు హరీష్ లు ఎమ్మెల్యేను కలిశారు. దీంతో జీవన్ రెడ్డి వర్గంలోని మిగతా నాయకులు సందిగ్ధంలో పడిపోయారు.

News January 18, 2026

HEADLINES

image

* వందేభారత్ స్లీపర్ ప్రారంభించిన PM మోదీ
* బెంగాల్‌లో బీజేపీ రావాలి: PM మోదీ
* ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కే తొలి ప్రాధాన్యం: TG CM రేవంత్
* ప్రధాని అండతో అభివృద్ధిలో ముందుకెళ్తాం: AP CM CBN
* AP కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమకు శంకుస్థాపన
* రేవంత్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారు: KTR
* తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు
* JEE మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల