News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.
Similar News
News January 19, 2026
నాకు పెళ్లి కాలేదు: డింపుల్ హయాతి

తనకు పెళ్లి అయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని హీరోయిన్ డింపుల్ హయాతి ఖండించారు. ‘ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయింది’ అని ఓ నెటిజన్ SMలో కామెంట్ చేయగా ‘నాకు పెళ్లి కాలేదు’ అంటూ ఆమె రిప్లై ఇచ్చారు. డింపుల్, ఆమె భర్త డేవిడ్‌పై పోలీస్ కేసు నమోదైందంటూ సదరు నెటిజన్ ఓ న్యూస్ ఆర్టికల్‌ను షేర్ చేయగా అది ఫేక్ అని ఆమె బదులిచ్చారు. కాగా డింపుల్ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ సంక్రాంతికి థియేటర్లలో విడుదలైంది.
News January 19, 2026
హైదరాబాద్‌లో కొత్త ట్రెండ్.. ‘పబ్బుల్లో పాఠాలు’

సిటీ కుర్రాళ్ల సోషల్ లైఫ్ ఇప్పుడు రూటు మార్చింది. వీకెండ్ వస్తే కేవలం డాన్స్ ఫ్లోర్ల మీద స్టెప్పులేయడమే కాదు.. చేతిలో బీర్ గ్లాసు పట్టుకొని ‘స్ట్రింగ్ థియరీ’ వంటి కఠినమైన సైన్స్ ముచ్చట్లు వినడం ఇప్పుడు GEN-Zలో కొత్త క్రేజ్. ‘పింట్ ఆఫ్ వ్యూ’ వంటి ఈవెంట్లే దీనికి సాక్ష్యం. సైన్స్, హిస్టరీ, క్వాంటం ఫిజిక్స్ వంటి సీరియస్ విషయాలను చిల్ అవుతూ నేర్చుకోవడానికి మన HYD కుర్రాళ్లు బాగా ఇష్టపడుతున్నారు.
News January 19, 2026
నారాయణపేట: ‘వేసవిలో తాగునీటి ఎద్దడి రానీయొద్దు’

NRPT జిల్లాలో వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ నీరు అందేలా చూడాలని, నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని సూచించారు. సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.


