News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.
Similar News
News January 23, 2026
రాహుల్, థరూర్ మధ్య ముదిరిన విభేదాలు?

రాహుల్ గాంధీపై శశి థరూర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొచ్చిలో జరిగిన సమావేశంలో వేదికపై తన పేరును రాహుల్ కావాలనే ప్రస్తావించలేదని థరూర్ నొచ్చుకున్నట్లు సమాచారం. దీంతో కేరళ ఎన్నికల సన్నద్ధతపై నేడు నిర్వహించనున్న కీలక సమావేశానికి ఆయన డుమ్మా కొట్టనున్నట్లు తెలుస్తోంది. గతంలో PM మోదీని పొగిడారనే కారణంతో పార్టీ నాయకత్వం థరూర్‌ను పక్కన పెడుతోందన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
News January 23, 2026
వంటింటి చిట్కాలు

* పూరీలు తెల్లగా ఉండాలంటే వేయించే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ, జంతికల పిండిలో పాలు పోస్తే కరకరలాడతాయి.
* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయించాలి. ఇలా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ ఉంటాయి.
* బంగాళదుంపలతో కలిపి నిల్వ చేస్తే వెల్లుల్లి చాలా కాలం తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించే ముందు కాసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి.
News January 23, 2026
కందుకూరు LICలో రూ.3 కోట్లు స్కాం

కందుకూరు LICలో భారీ స్కాం బయటపడింది. పూర్వాశ్రమంలో ఏజెంట్‌గా ఉండి తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్‌గా మారిన పూజల శ్రీనివాస్ పథకం ప్రకారం స్కాంకు పాల్పడ్డాడు. దొంగ పాలసీలు చేయించి నకిలీ డెత్ సర్టిఫికెట్లతో రూ.కోట్లు కాజేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని సమాచారం. ప్రాథమిక విచారణలో రూ.3 కోట్లు కాజేసినట్లు తెలుస్తోంది. కొత్త సాప్ట్‌వేర్‌తో ఈ స్కాం బయటపడిందని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


