News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.
Similar News
News January 19, 2026
ఖమ్మం: ఉదారతను చాటుకున్న డీఈఓ

పదో తరగతి విద్యార్థులపై డీఈఓ చైతన్య జైనీ తన ఉదారతను చాటుకున్నారు. నేలకొండపల్లి మండలంలోని ప్రత్యేక తరగతులకు హాజరయ్యే 13 పాఠశాలల విద్యార్థులకు తన సొంత ఖర్చుతో స్నాక్స్ అందించాలని నిర్ణయించారు. సుమారు 250 మంది విద్యార్థులకు నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రతిరోజూ సాయంత్రం రూ.20 విలువైన అల్పాహారం పంపిణీ చేయనున్నారు.
News January 19, 2026
బయ్యారంలో పెద్దపులి?

MHBD జిల్లా బయ్యారంలో పెద్దపులి పాద ముద్రలు కలకలం రేపాయి. మండలంలోని మెట్ల తిమ్మాపురం, కొత్తపేట, నగరం అటవీ ప్రాంతంలో పాదముద్రలను స్థానికులు గుర్తించారు. ఈ నెల 15, 16న పులి సంచరించి ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు. ఈ మేరకు FRO సువర్చలను వివరణ కోరగా.. కొత్తగూడ మండలంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని, బయ్యారంలో విచారణ చేపట్టామని, ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు.
News January 19, 2026
కామారెడ్డి: వన్య ప్రాణుల గణనకు వేళాయే!

కామారెడ్డి జిల్లాలో 82,670 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కామారెడ్డి, బాన్సువాడ డివిజన్ పరిధిలోని 119 బీట్‌లలో ఈనెల 20 నుంచి వన్య ప్రాణుల గణన ప్రారంభం కానుంది. ప్రతి 4 సం.రాలకోసారి అటవీ శాఖ అధికారులు జంతువుల సంఖ్యను లెక్కగడతారు. ఈ సంవత్సరం పెద్దపులి, చిరుతల సంచారం ఎక్కువైంది. దీంతో మన జిల్లాలో పులుల లెక్కతో పాటు అన్ని జంతువుల లెక్కను అధికారులు వాలంటీర్ల సహాయంతో సర్వే చేయనున్నారు.


