News November 20, 2025
నాగర్‌కర్నూల్‌లో పెరిగిన చలి

నాగర్‌కర్నూల్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెల్దండ మండలం బొల్లంపల్లిలో 12.0°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్‌లో 12.3°C, బిజినేపల్లిలో 12.4°C చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో అధిక చలి కారణంగా జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Similar News
News January 17, 2026
దేశం కోసం కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారు: కూనంనేని

ఖమ్మం: దేశంలో పోరాటాల ద్వారానే అనేక సమస్యలను పరిష్కరించుకుంటున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయా సంఘాలను ఏర్పాటు చేసి ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టామన్నారు. దేశం కోసం ఎంతోమంది కమ్యూనిస్టులు ప్రాణాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మంలో రేపు సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా TWJF ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు.
News January 17, 2026
HYDలో పలు చోట్ల ఫేక్ టాబ్లెట్స్.. జాగ్రత్త..!

HYDలో DGCA రిపోర్టు ప్రకారంగా.. తప్పుడు ఔషధ కంపెనీల పేర్లతో పలు మెడికల్ షాపుల్లో తప్పుడు లేబుల్స్ ఔషధాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. అంతర్రాష్ట్ర నకిలీ మందుల ముఠాలు దీని వెనుక ఉన్నట్లు ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది.
News January 17, 2026
సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు హౌస్ అరెస్ట్

లష్కర్ ప్రాంతంలో నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలు దెబ్బతినకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


