News February 23, 2025
నాగర్‌కర్నూల్‌లో యువతి SUICIDE

కల్వకుర్తిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలిలా.. పట్టణంలోని ఇందిరానగర్‌లో ఉంటున్న అనూష(20) డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో ఇంటర్ విద్యార్థి ఆమె ప్రేమించుకుంటున్నారు. కాగా.. మంగళవారం సదరు విద్యార్థితో అనూష ఫోన్ మాట్లాడిన అనంతరం పురుగు మందు తాగగా.. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. పోస్టుమార్టంలో యువతి గర్భందాల్చినట్లు ఆరోపణలున్నాయి. కేసు నమోదైంది.
Similar News
News March 26, 2025
మహబూబ్‌నగర్ POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన..?

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. కాగా MBNR డీసీసీ చీఫ్‌గా MLA మధుసూదన్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు NP.వెంకటేశ్, వినోద్, సిరాజ్, రబ్బానీ ఆశావహులుగా ఉన్నారు.
News March 26, 2025
కొడంగల్: తిరుపతిరెడ్డిపై పోస్ట్.. యువతిపై కేసు నమోదు

సీఎం రేవంత్ రెడ్డి అన్న, కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తిరుపతిరెడ్డి ఈనెల 22న కోస్గి మండలం బిజ్జూరంలో పర్యటించారు. ఆ సమయంలో ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతిపై కేసు నమోదు చేసినట్లు SIబాల్‌రాజ్ తెలిపారు. తిరుపతిరెడ్డి భూకబ్జాలు చేసేందుకు వచ్చాడని హన్మాన్‌పల్లి వాసి పద్మ వాట్సాప్ గ్రూపుల్లో ఆధారాలు లేకుండా తప్పుడు మెసేజ్ చేసిందని NSUIఅధ్యక్షుడు అశోక్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.
News March 26, 2025
MBNR: ఆర్టీసీ బస్టాండ్‌లో కంకర తేలిన సీసీ రోడ్డు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సీసీ రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు బస్టాండ్ ఆవరణలో నీరు నిలిచి కంకర తేలి, గొయ్యిలా ఏర్పడి ప్రయాణికులు, విద్యార్థులకు, ఆర్టీసీ బస్సు వాహనాదారులకు ఇబ్బందికరంగా మారింది. వెంటనే రోడ్డు, రవాణా, ఆర్టీసీ అధికారులు సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.