News April 12, 2025
నాగర్‌కర్నూల్: ఆనవాయితీగా కురుస్తున్న వర్షం..!

చారకొండ మండలం సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయానికి రెండో భద్రాద్రిగా పేరుంది. ఇక్కడ ఏటా శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే కళ్యాణానికి ముందు, బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే రథోత్సవం తర్వాత వర్షం కురవడం ఆనవాయితీగా వస్తోందని స్థానికులు తెలిపారు. ఎంతటి కరవు వచ్చినా ఈ రెండు సందర్భాల్లో తప్పనిసరి వర్షం వచ్చి అక్కడ దేవాలయాన్ని శుభ్రపరుస్తుందని స్థానికులు నమ్ముతున్నారు.
Similar News
News January 15, 2026
యోగాసన పోటీల్లో మెదక్ క్రీడాకారుల ప్రతిభ

అస్మిత సౌత్ జోన్ యోగాసన ఛాంపియన్‌షిప్‌లో మెదక్ జిల్లా చేగుంటకు చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్ నాచారం డీపీఎస్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దక్షిణ భారత రాష్ట్రాల నుంచి 350 మందికి పైగా పాల్గొన్నారు. రిత్మిక్ పెయిర్ విభాగంలో సైనీ శిరీష, చిక్కుల మనోజ నాలుగో స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత పొందారు. వారు త్వరలో ఢిల్లీలో జరిగే జాతీయ అస్మిత యోగాసన పోటీల్లో పాల్గొననున్నారు.
News January 15, 2026
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు… అప్లై చేశారా?

<
News January 15, 2026
ఇంద్రవెల్లి: ఇక ఈ బాధ్యత.. అల్లుడిదే..!

ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన కేస్లాపూర్ నాగోబా జాతర ఈనెల 18న ప్రారంభం కానుంది. మెస్రం వంశీయులు హస్తినమడుగు పవిత్ర గంగాజలాన్ని సేకరించారు. మర్రిచెట్టుపై గంగా జలాన్ని భద్రపరిచారు. కలశం (జారీతాలి) నేలపై జారి పడకుండా మహాపూజలు అయ్యే వరకు చెట్టుపై మెస్రం వంశానికి చెందిన అల్లుడే భద్రపరుస్తుంటారు. ఈనెల 15, 16, 18న మహాపూజ, 22న దర్బార్, 22న పెర్సపేన్ బాన్కక్ పూజలు నిర్వహించనున్నారు.


