News April 10, 2025
నాగర్‌కర్నూల్: చిన్నతగాదాతో భార్యాభర్తల సూసైడ్

చిన్నతగాదా భార్యాభర్తల ప్రాణాలు తీసి, 11 నెలల బాలుడిని అనాథ చేసిన ఘటన HYDహయత్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NGKLజిల్లా అమ్రాబాద్‌కు చెందిన దంపతులు నగేశ్, శిరీష బతుకుదెరువు నిమిత్తం HYD వచ్చారు. ఇటీవల వారి మధ్య చిన్న వివాదం తలెత్తగా శిరీష ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. రాత్రి బంధువుల పూచీకత్తుతో అతడిని వదిలేయగా బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయాడు.
Similar News
News January 12, 2026
కోడి పందేల నిర్మూలన పోస్టర్ ఆవిష్కరణ

జిల్లాలో కోడి పందేలను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. కోడి పందేలు నిషేధం, శిక్షార్హ నేరం అనే అంశంపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులతో కలిసి ఆవిష్కరించారు.
News January 12, 2026
తిరుపతి: శెట్టిపల్లి లబ్ధిదారులకు సంక్రాంతి బోనస్

తిరుపతి జిల్లా సెట్టిపల్లి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ఊరట కల్పించింది. తుడా అథారిటీ ద్వారా కేటాయించే మొత్తం 286.83 ఎకరాల భూమికి సంబంధించిన అన్ని కన్వేయన్స్ డీడ్లపై స్టాంప్ డ్యూటీతోపాటు రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సుమారు రూ.16.25 కోట్ల వరకు ఆర్థికభారం తగ్గనుందని అధికారులు అంచనా వేశారు.
News January 12, 2026
ఖమ్మం: బస్సు కోసం వేచి ఉంటూ.. అనంతలోకాలకు!

నేలకొండపల్లిలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.


