News October 8, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాకు వర్ష సూచన

నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రెండు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Similar News
News January 13, 2026
రూపాయి క్షీణత.. హెచ్చుతగ్గుల్లో భాగమే: RBI గవర్నర్

ఇటీవల రూపాయి <<18834841>>విలువ<<>> పడిపోతుండటం తెలిసిందే. డాలర్‌తో పోలిస్తే రూపీ వాల్యూ రూ.90ని దాటింది. అయితే ఇది సాధారణ హెచ్చుతగ్గుల్లో భాగమేనని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ‘రూపాయి, మారకపు రేట్లపై RBI విధానం ఏళ్లుగా స్థిరంగా ఉంది. మార్కెట్లు బలంగా ఉన్నాయని మేం నమ్ముతున్నాం. ధరలను అవే నిర్ణయిస్తాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత ఎకానమీ మూలాలు బలంగా ఉన్నాయని తెలిపారు.
News January 13, 2026
మరో 4 సహకార బ్యాంకులు : CEO శ్రీనివాసరావు

కేంద్ర కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మరో 4 సహకార బ్యాంకులు అందుబాటులోకి రానున్నాయని సొసైటీ CEO శ్రీనివాసరావు Way2Newsతో తెలిపారు. ఇప్పటికే 23 ఉండగా నూతనంగా 4 బ్యాంకులను ఇందుకూరుపేట, నెల్లూరు(R)లో కాకుపల్లి, కొత్తూరు, డక్కిలి ప్రాంతాల్లో ఏర్పాటు చేసి రైతులకు సేవలు అందిస్తామని వెల్లడించారు. తమ బ్యాంకు పరిధిలో ఈ ఏడాది రూ.2900 కోట్ల వ్యాపార లక్ష్యానికి రూ.2250 కోట్లకు చేరువయ్యామని తెలిపారు.
News January 13, 2026
మెదక్ జిల్లాలో 27 మందికి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టింగ్‌లు

మెదక్ జిల్లాలో 27 మందికి ల్యాబ్ టెక్నీషియన్‌గా పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజానర్సింహా, ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేతులు మీదుగా అభ్యర్థులు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


