News February 2, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం

వేర్వేరు ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. కొండనాగులకు చెందిన జోగు మల్లయ్య(45), తిమ్మాజిపేట మండలం ఆవంచలో సత్తయ్య(42)లు ఇంట్లో చెప్పకుండా.. వారి వారి గ్రామ సమీపాల్లోని కుంటల్లో చేపలవేటకు వెళ్లారు. వారు ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు వెతకసాగారు. రెండురోజుల అనంతరం ఇద్దరూ ఆయా కుంటల్లో శవాలై ఆ ఊర్ల వారికి కనిపించారు. ఈ ఘటనలపై కేసునమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 7, 2025
ప్రత్యేక తరగతులు పక్కడ్బందీగా నిర్వహించాలి: DEO

జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పక్కడ్బందీగా నిర్వహించాలని సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఉదయం 8:15 నుంచి 9:15 వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పారు. సాయంత్రం అల్పాహారం అందించాలని పేర్కొన్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 7, 2025
MLC ఎన్నికల బరిలో నలుగురు జన్నారం వాసులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో జన్నారం మండలానికి చెందిన నలుగురు నిలిచారు. మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, చింతగూడకు చెందిన మేకల అక్షయ్ కుమార్, దేవుని గూడెం గ్రామానికి చెందిన గవ్వల శ్రీకాంత్, ఆయన భార్య గవ్వల లక్ష్మి శ్రీకాంత్ ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. మండలానికి చెందిన మరి కొంతమంది ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసే అవకాశముంది.
News February 7, 2025
ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం

TG: ఇంటర్ ప్రాక్టికల్స్‌కు హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలని బోర్డు నిర్ణయించింది. అనారోగ్యం లేదా అత్యవసర కారణాల వల్ల నిర్ణీత తేదీల్లో పరీక్షలకు హాజరు కాని వారికి మళ్లీ ఎగ్జామ్ రాసేందుకు ఛాన్స్ ఇవ్వనుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం విద్యార్థులు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీని సంప్రదించాలని సూచించింది. ఈనెల 22తో ఇంటర్ ప్రాక్టికల్స్ ముగియనున్నాయి.