News November 6, 2025

నాగర్ కర్నూల్: ఈనెల 15న లోక్ అదాలత్

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో కేసుల పరిష్కారానికి ఈనెల 15‌వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రెటరీ నసీమ సుల్తానా తెలిపారు. పోలీసు అధికారులు వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా చూడాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారంతో అప్పీల్ లేని తీర్పును పొందవచ్చన్నారు.

Similar News

News January 20, 2026

నల్గొండ: M. Ed విద్యార్థులకు అలర్ట్

image

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో M.Ed semester-3 (R-23) రెగ్యులర్‌కు సంబంధించిన పరీక్షల టైం టేబుల్ యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి-10 నుంచి ఫిబ్రవరి-23 మధ్య జరుగుతాయి అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని కోరారు.

News January 20, 2026

మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్పీ సునీల్ షొరాణ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ఎక్సైజ్, సెబ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

News January 20, 2026

‘ఎంపిక చేసిన గ్రామాల్లో రీ సర్వేకు సిద్ధం కావాలి’

image

రాష్ట్రంలో ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాల్లో భూ రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సిసిఎల్ఎ కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లైసెన్డ్ సర్వేయర్లను కేటాయించి, రెండో గెజిట్ నోటిఫికేషన్ తర్వాత శాస్త్రీయంగా సర్వే చేపట్టాలని సూచించారు. భూభారతి కింద చేపట్టే ఈసర్వేకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.