News November 19, 2025

నాగర్ కర్నూల్: రేపు కబడ్డీ జట్ల ఎంపికలు

image

NGKL(D) కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి MJP(CBM) కళాశాలలో రేపు కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు ఎం.జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ తెలిపారు. జూనియర్ బాలికలు(31-12-2005) తర్వాత జన్మించి, బరువు 65kgs లోపు, సీనియర్ మహిళలు 75kgs లోపు ఉండాలన్నారు. ఒరిజినల్ బోనోఫైడ్, టెన్త్ మెమో,ఆధార్‌తో హాజరు కావాలన్నారు. వివరాలకు 77803 42434 సంప్రదించాలన్నారు.

Similar News

News January 20, 2026

ఖమ్మంలో పూడ్చిపెట్టిన మహిళ మృతదేహానికి పోస్టుమార్టం

image

ఖమ్మం రమణగుట్టలో సంచలనం రేపిన శైలజ(26) మరణంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనారోగ్యంతో మరణించిందని నమ్మించి భర్త సురేందర్ హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించగా, అనుమానం వచ్చిన మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ పర్యవేక్షణలో సోమవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. వివాహేతర సంబంధం కోసమే ఇంజెక్షన్‌తో భార్యను హతమార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

News January 20, 2026

నెల్లూరు: 12 ఏళ్లలో పల్లె నుంచి పారిశ్రామిక హబ్ దాకా.!

image

గత 12 ఏళ్లలో ముత్తుకూరు ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 2014లో కేవలం చేపల వేట, రొయ్యల సాగుకే పరిమితమైన ఈ తీర ప్రాంతం, 2026 నాటికి ఏపీలోనే కీలక ఆర్థిక కేంద్రంగా ఎదిగింది. అదానీ పోర్ట్ విస్తరణ, భారీ థర్మల్ ప్లాంట్లు, 4-లేన్ రోడ్లతో నేడు గ్లోబల్ మ్యాప్‌లోకి ఎక్కింది. నాడు వలసలకు నిలయమైన ముత్తుకూరు, నేడు వేలాది మందికి స్థానికంగానే ఉపాధి కల్పిస్తూ, రియల్ ఎస్టేట్‌లో రికార్డులు సృష్టిస్తోంది.

News January 20, 2026

ఆర్సీబీ సరికొత్త చరిత్ర

image

WPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త చరిత్ర సృష్టించింది. టోర్నీలో వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. గత సీజన్‌‌లో RCB తన చివరి మ్యాచ్‌లో గెలవగా ఈసారి వరుసగా ఐదు విజయాలు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో 2024లో తొలి ట్రోఫీని గెలుచుకున్న స్మృతి సేన మరోసారి టైటిల్‌పై కన్నేసింది. నిన్న గుజరాత్‌తో మ్యాచులో విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.