News March 27, 2024
నాగర్ కర్నూల్ లోక్‌సభ పరిధిలోని ఓటర్లు

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలిలా..
✓ నాగర్ కర్నూల్ అసెంబ్లీ- 2,38,133
✓ అచ్చంపేట అసెంబ్లీ- 2,47,621
✓ కల్వకుర్తి అసెంబ్లీ- 2,42,962
✓ కొల్లాపూర్ అసెంబ్లీ – 2,38,459
✓ వనపర్తి అసెంబ్లీ – 2,72,653
✓ గద్వాల అసెంబ్లీ- 2,55,866
✓ అలంపూర్ అసెంబ్లీలో- 2,39,079 మంది ఓటర్లు ఉన్నారు. ఇంకా ఓటరుగా నమోదు చేసుకోని వారి కోసం మరోసారి అవకాశం కల్పించారు.
Similar News
News February 19, 2026
MBNR: రంజాన్.. ఉపవాస దీక్షలు ప్రారంభం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ శోభ సంతరించుకుంది. పవిత్రమైన రంజాన్ మాసం నేపథ్యంలో నేటి నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. నిన్న నెలవంక కనిపించడంతో ముస్లింలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మసీదులను విద్యుద్వీపాలతో అలంకరించారు. నెలరోజులపాటు తరావీ నమాజ్‌లు చేయనున్నారు. ఇప్పటికే రంజాన్ నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో వెసులుబాటును కల్పిస్తూ.. GOVT ఉత్తర్వులు జారీ చేసింది.
News February 19, 2026
పాలమూరు: మోడల్ స్కూల్.. అప్లై చేసుకోండి

మహబూబ్ నగర్ (D) గండీడ్ (M) వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలో (మోడల్ స్కూల్) చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీలు ఉన్నాయని, ఈనెల 28లోగా https://tgms.telangana.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 19
SHARE IT
News February 17, 2026
జడ్చర్ల: ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గంగాపూర్ గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో వాహనంపై ప్రయాణిస్తున్న మిడ్జిల్ మండలం రాణి పేట గ్రామానికి చెందిన బోయ శివ(26) అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి రజని (26) కి తీవ్ర గాయాలు కాగా 108లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


