News December 1, 2025
నాగిరెడ్డిపేట: బీమా డబ్బు కోసం వేధింపులు.. మహిళ ఆత్మహత్య

నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన లక్ష్మీ అత్తారింటికి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. లక్ష్మీ భర్త గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు చెప్పారు. ఆయన పేరుపై వచ్చిన బీమా డబ్బుల కోసం అత్తారింటి వారు లక్ష్మిని వేధించినట్లు పేర్కొన్నారు. దీంతో వారి వేధింపులు భరించలేక ఇంట్లో ఉరేసుకున్న మృతి చెందినట్లు ఆయన వివరించారు.
Similar News
News February 17, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరల వివరాలు.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.15,400
* 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.14,168
* 10 గ్రాముల వెండి ధర రూ.2,438.
News February 17, 2026
కామారెడ్డి: ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ ఆదర్శం: ఎమ్మెల్యే

తనకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైయస్ఆర్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఆదర్శమని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చెప్పారు. మంగళవారం కామారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరాగాంధీలో పేదలకు చేసిన సేవ, చంద్రబాబు నాయుడులో ముందస్తు విజన్ తనకు ఆదర్శమన్నారు.
News February 17, 2026
GNT: అసెంబ్లీలో విద్యార్థుల సందడి

ఏపీ అసెంబ్లీ విద్యార్థులతో కిటకిటలాడింది. మంగళవారం సుమారు 300 మంది విద్యార్థులు సభను సందర్శించారు. గత ఐదు రోజుల్లో మొత్తం 1,100 మంది వచ్చారు. సభా కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. విరామ సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు విద్యార్థులను పలకరించారు. వారి సందేహాలను స్పీకర్ నివృత్తి చేశారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.


