News October 7, 2025
నాగ్‌పూర్- HYD హైస్పీడ్ కారిడార్‌పై SCS సమీక్ష

విజన్- 2047లో భాగంగా నాగ్‌పూర్ నుంచి HYD వరకు నిర్మించనున్న హైస్పీడ్ కారిడార్ అభివృద్ధిపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమవేశం నిర్వహించారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, KNR, సిరిసిల్ల, సిద్ధిపేట కలెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. KNRలోని గంగాధర, రామడుగు, కొత్తపల్లి మండలాల మీదుగా వెళ్తున్న కారిడార్ కోసం చేపట్టాల్సిన భూసేకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News January 14, 2026
HYD: ఆకాశంలో తెగిపోని అనుబంధం!

పతంగి.. ఇది కాగితం ముక్క కాదు. నాన్న నేర్పిన మొదటి గెలుపు పాఠం. మాంజాకు వేళ్లు తెగుతున్నా లెక్కచేయకుండా పతంగిని తండ్రి గాల్లోకి విసిరే ఆ క్షణం ఒక అపురూపమైన దృశ్యం. ‘కింద పడినా మళ్లీ ఎగరాలి’ అని నేర్పే గాలిపటం స్ఫూర్తి గొప్పది. పొరిగింటి వాడి పతంగిని కట్ చేసినప్పుడు వచ్చే ఆ కేకల్లో చిన్ననాటి జ్ఞాపకాలు దాగున్నాయి. ఫోన్లకు దూరంగా కాటే నినాదాల నడుమ ఆకాశంలో తెగిపోని బంధంలా హైదరాబాదీలకు పతంగి మారింది.
News January 14, 2026
కామారెడ్డి: గాలిపటాల జోష్.. రోడ్లపై డెత్ రేస్!

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. అయితే, ఈ సరదా కాస్తా ఒక్కోసారి పెను ప్రమాదాలకు దారితీస్తోంది. గాలిపటం తెగిపోగానే దానిని పట్టుకోవాలనే తాపత్రయంతో చిన్నారులు ప్రాణాలకు తెగించి రోడ్ల వెంట పరుగు పెడుతున్నారు. పండుగ పూట విషాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
News January 14, 2026
కొత్తకొండలో స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో కిక్కిరిసిన భక్తులు

భోగి పండుగను పురస్కరించుకొని కొత్తకొండ వీరభద్రస్వామి జాతరలో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. తమ గండాలు, కష్టాలు తొలగిపోవాలని గండ దీపం వద్ద నూనె పోసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, గుమ్మడికాయ కోరమీసాలు సమర్పిస్తూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర ప్రాంగణం భక్తుల జయ జయ ధ్వానాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.


