News August 9, 2024

నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకుంది మన తెనాలి అమ్మాయినే

image

హీరో నాగ చైతన్య శోభితా ధూళిపాళ్ల గురువారం నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా శోభితా స్వస్థలం తెనాలి అన్న విషయం బాగా వైరల్ అవుతుంది. తెనాలికి చెందిన ఉపాధ్యాయుడు JVL శాస్త్రి, కమలమ్మ దంపతుల కుమార్తె శాంతాకామాక్షి. ఆమె తెనాలిలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఆమెకు విశాఖకు చెందిన వేణుగోపాల్‌తో వివాహమైంది. వీరికి శోభిత, సమంత సంతానం. ఇద్దరూ తెనాలిలోనే పుట్టారు. అనంతరం ముంబాయిలో స్థిరపడ్డారు.

Similar News

News December 11, 2025

గుంటూరుని బాల్యవివాహాల రహితంగా మార్చాలి: కలెక్టర్

image

బాల్యవివాహాల రహిత జిల్లాగా ఆవిష్కృతం చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఆ దిశగా అన్నీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. బాల్యవివాహాల అనర్థాలను తల్లిదండ్రులు గ్రహించాలని సూచించారు. బాల్య వివాహాలు లేని సమాజం పురోగతి సాధిస్తుందని చెప్పారు. బాల్య వివాహ ముక్త్ భారత్ (బి.వి.ఎం.బి) వంద రోజుల ప్రచార కార్యక్రమంపై కలెక్టరేట్‌లో గురువారం సమీక్షలో మాట్లాడారు.

News December 11, 2025

ఫైల్స్ పరిష్కారంలో మన జిల్లా మంత్రులకు సీఎం ర్యాంక్లు

image

ఏపీ సచివాలయంలో ఫైల్స్ పరిష్కారంలో మంత్రి నారా లోకేశ్ 9వ స్థానంలో నిలిచారు. ఆయన 3,669 ఫైళ్లను పరిష్కరించారు. సగటున ఒక్కో ఫైలుకు కేవలం 3 రోజుల సమయం తీసుకున్నారు. ఇతర మంత్రులు 13వ స్థానంలో అనగాని సత్యప్రసాద్: 2,269 ఫైళ్లు (4 రోజులు 21గంటలు). 22వ స్థానంలో నాదెండ్ల మనోహర్: 325 ఫైళ్లు (9 రోజుల 3గంటలు). కాగా వారి శాఖను బట్టి పరిపాలనలో వేగం, పారదర్శకత పెంచేందుకు మంత్రులు కృషి చేస్తున్నారు.

News December 11, 2025

నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు

image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు శుక్రవారం రానున్నారు. ప్రజల నుంచి వినత పత్రాలు సీఎం స్వీకరించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 3:30 నిమిషాలకు సీఎం కార్యాలయానికి చేరుకుని తిరిగి సాయంత్రం 6:15 ఉండవల్లిలోని నివాసానికి వెళ్తారని ఆయన అధికారిక షెడ్యూల్‌లో పేర్కొన్నారు.