News November 20, 2025

నాణెం ఎలా ఉంది?

image

పుట్టపర్తి సత్యసాయి బాబా సేవలను స్మరించుకుంటూ ప్రధాని మోదీ రూ.100 స్మారక నాణెం, పోస్టల్‌ స్టాంపులను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాణేన్ని ముద్రించింది. ఈ నాణేన్ని వెండి, రాగి, నికెల్, జింక్‌తో తయారు చేసినట్లు తెలుస్తోంది. నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు సత్యసాయి చిత్రం, ఆ చిత్రం కింద భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని హిందీ భాషలో ముద్రించారు.

Similar News

News January 16, 2026

ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో BJP కూటమి

image

మహారాష్ట్రలో ముంబై, పుణే సహా 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. BMCలో ఎర్లీ ట్రెండ్స్‌ ప్రకారం BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఠాక్రే సోదరుల కూటమి మాత్రం వెనుకంజలో ఉంది. దాదాపు 50% పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయి.

News January 16, 2026

విజయవాడలో దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళ హత్య!

image

విజయవాడ కేదారేశ్వరరావుపేటలో దారుణం జరిగింది. శివ కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్న హుస్సేన అనే వివాహిత శుక్రవారం తెల్లవారుజామున హత్యకు గురైంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే శివ కుమార్ ఆమెను హతమార్చి పరారైనట్లు సమాచారం. అజిత్‌సింగ్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

News January 16, 2026

NLG: రైతులకు అలర్ట్.. ఫార్మర్ రిజిస్ట్రీ లేకుంటే పథకాలు కట్

image

వ్యవసాయ ఆధునికీకరణలో భాగంగా ప్రభుత్వం ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదును తప్పనిసరి చేసింది. ఈ ఐడీ ఉంటేనే పీఎం కిసాన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి అందుతుందని అధికారులు తెలిపారు. ఉమ్మడి నల్గొండలో ఇంకా చాలా మంది రైతులు నమోదు చేసుకోకపోవడంతో ఏఈవోలు లేదా మీ-సేవా కేంద్రాలను రైతులు సంప్రదించాలని వారు సూచించారు. భవిష్యత్తులో పథకాలు పొందాలంటే ఈ నమోదు కీలకమని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.