News June 4, 2024

నాదెండ్ల మనోహర్‌కు 47,362 ఓట్ల ఆధిక్యం

image

తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ భారీ ఓట్ల మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం 18వ రౌండ్ ముగిసేసరికి ఆయన 47,362 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. నాదెండ్లకు 1,13,596 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌కు 66,234 ఓట్లు నమోదయ్యాయి. మిగతా 2 రౌండ్లలో కూడా మనోహర్ ఆధిక్యం ప్రదర్శిస్తే, పవన్ లాగా 50వేల ఓట్ల మెజారిటీ సాధించే అవకాశం ఉంది.

Similar News

News September 29, 2024

అమరావతి: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.లక్ష విరాళం

image

క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆదివారం రూ.లక్ష చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. వరద బాధితులకు తక్షణ సాయంగా చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తూ ఎంతగానో బాధితులను ఆదుకున్నారని క్రైస్తవ మిషనరీ సంఘం వారు ఆన్నారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సహాయం అందించడం జరిగిందని మిషనరీ బిషప్ అన్నారు.

News September 29, 2024

పల్నాడు: రైలులో భారీ చోరీ

image

హుబ్లీ నుంచి విజయవాడ వస్తున్న రైలులో శనివారం ఉదయం చోరీ జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన జ్యువెలర్స్ షాపు నిర్వాహకులు రంగారావు, సతీశ్‌లకు చెందిన రూ.2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. రైలు నంద్యాల చేరుకున్న అనంతరం తాము నిద్రపోగా చోరీ జరిగిందని, నంద్యాల రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చామని రంగారావు, సతీశ్ తెలిపారు.

News September 29, 2024

హోంమంత్రి అనిత డిక్లరేషన్ ఇచ్చారా.?: అంబటి

image

‘హోంమంత్రి శ్రీమతి అనిత గారు శ్రీవారి దర్శనానికి వెళ్లారు డిక్లరేషన్ ఇచ్చారా? లేదా?’ అని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ఆమెను ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల దర్శనానికి వెళ్లాలని హోంమంత్రి అనితతో పాటు పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అంబటి తనదైన శైలిలో స్పందించారు. డిక్లరేషన్‌పై కొద్ది రోజులుగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే.