News November 19, 2025

నామినేటెడ్ పోస్టుల్లో అర్బన్ నక్సల్స్: బండి సంజయ్

image

అర్బన్ నక్సల్స్ నామినేటెడ్ పోస్టులు, కమీషన్లు వచ్చే పదవుల్లో కొనసాగుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంతో అర్బన్ నక్సల్స్ కుమ్మక్కై నామినేటెడ్ పోస్టులు, కమిషన్ పదవులు అనుభవిస్తున్నారన్నారు. వారి మాయ మాటలు నమ్మి అమాయక దళిత, గిరిజనులు తుపాకీ పట్టుకుని అడవుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.

Similar News

News January 17, 2026

ముక్కనుమ రోజు మాంసాహారం తినవచ్చా?

image

భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్లో శాకాహారానికే ప్రాధాన్యతనిచ్చే ప్రజలు నాలుగో రోజైన ముక్కనుమ నాడు మాంసాహారాన్ని ఇష్టంగా వండుకుంటారు. అందుకే దీనిని వాడుక భాషలో ముక్కల పండుగ అని పిలుస్తారు. ఈ రోజున గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి, ఆపై బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలు చేయడం తరతరాలుగా వస్తున్న ఆచారం. శాస్త్రపరంగా దీనికి అభ్యంతరం లేదు కాబట్టి, పల్లెల్లో ప్రతి ఇంటా ముక్కనుమ విందు ఘనంగా జరుగుతుంది.

News January 17, 2026

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు యువతి

image

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు బి.క్యాంప్‌కు చెందిన శ్రీహిత ఎంపికైనట్టు శిక్షకులు పాలు విజయకుమార్, బ్రహ్మ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈనెల 21న నుంచి 28వ తేదీ వరకు మణిపూర్‌లో జరిగే అండర్-19 ఎస్జీఎఫ్ఐ ఫుట్‌బాల్ పోటీలలో శ్రీహిత పాల్గొంటుందని పేర్కొన్నారు. గత అక్టోబర్‌లో ఎమ్మిగనూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు.

News January 17, 2026

రూ.13 వేల కోట్ల ప్రాజెక్ట్.. నేడే శంకుస్థాపన

image

AP: రాష్ట్రంలో రూ.13,000 కోట్ల పెట్టుబడితో 495 ఎకరాల్లో కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకి నేడు CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్‌ ద్వారా 2,600 మందికి ఉపాధి దక్కనుంది. దీనిని AM గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తుండగా ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్ను గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కానుంది.