News December 1, 2025
నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా ఉండాలి: కలెక్టర్

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికల సన్నాహాల్లో భాగంగా సోమవారం ఆయన జక్రాన్‌పల్లి మండలం పడకల్ గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించారు. చివరి రోజున ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 12, 2026
నందిపేట్: ఇద్దరి మృతి.. రెండు కుటుంబాల్లో విషాదం

నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరుశివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శివ (28) బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఈనెల 2న నందిపేట్–కొండూరు మార్గంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో కొడుపల సాగర్ (30) చికిత్స పొందుతూ మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన శివ కూడా బుధవారం మృతి చెందాడు. ఒకే ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News February 12, 2026
భీంగల్‌లో అత్యధికం.. నిజామాబాద్‌లో అత్యల్పం

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి భీమ్‌గల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 69.78 శాతం పోలింగ్ నమోదవ్వగా NZB కార్పొరేషన్‌లో అత్యల్పంగా 59.12 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఆర్మూర్ మున్సిపాలిటీలో 68%, బోధన్‌లో 68.64 % నమోదైంది. భీంగల్‌లో 14,045 ఓట్లకు గాను 9,800 ఓట్లు, NZBలో 3,48,951 ఓట్లకు గాను 2,05,753 ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో 4,95,485 మంది ఓటర్లకు 3,06,697 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
News February 12, 2026
నిజామాబాద్: వార్ వన్ సైడ్… లేక హంగ్..?

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్, బీజేపీ తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే మొత్తం 60 వార్డుల్లో మ్యాజిక్ ఫిగర్ 30కి చాలా దగ్గర బీజేపీకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్‌కు 20కి అటు ఇటుగా, MIMకు 10కి పైబడి డివిజన్లు వచ్చే అవకాశం ఉందని, అయితే మేయర్ ఎన్నిక నాటికి ఎక్స్‌అఫీషియో ఓట్లు, ఇతర సమీకరణాలు కీలకమవుతాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.


