News February 8, 2025

నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి

image

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్స్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగులు, పట్టభద్రులు గత బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి మోసపూరిత వాగ్దానాలకు బలయ్యారన్నారు.

Similar News

News February 13, 2026

రామగుండం కార్పొరేషన్ ‘హస్త’గతం

image

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 60 డివిజన్లలో 38 స్థానాలను కైవసం చేసుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 13 స్థానాల్లో విజయం సాధించగా, ఏఐఎఫ్‌బీ 6 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ, సీపీఐ, ఇండిపెండెంట్ ఒక్కో స్థానంలో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల గెలుపు సంబరాలు మిన్నంటాయి.

News February 13, 2026

ఖమ్మం జిల్లాలో ఏ పార్టీ.. ఎన్ని వార్డులు గెలిచిందంటే?

image

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గెలిచిన పార్టీల వివరాలిలా..
☆ 1) ఏదులాపురం(32 వార్డులు).. కాంగ్రెస్-24, BRS-2, CPM-2, CPI-3, ఇండిపెండెంట్(IND)-1
☆ 2) వైరా(20).. కాంగ్రెస్-12, BRS-5, CPM-1, CPI-1, IND-1
☆ 3) సత్తుపల్లి(23).. కాంగ్రెస్-17, BRS-6
☆ 4) కల్లూరు(20).. కాంగ్రెస్-12, BRS-7, IND-1
☆ 5) మధిర(22).. కాంగ్రెస్-18, BRS-1, IND-3.

News February 13, 2026

NZB: బీజేపీ మేయర్ అభ్యర్థి స్రవంతి రెడ్డి విజయం

image

నిజామాబాద్ నగరంలోని ఆరో డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి విజయం సాధించారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డి బీజేపీ మేయర్ అభ్యర్థిగా ఆరో డివిజన్ నుంచి పోటీ చేశారు. ప్రత్యర్థిపై మెజారిటీతో గెలుపొందారు. తనకు ఓటు వేసి గెలిపించిన వార్డు సభ్యులకు స్రవంతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.