News May 7, 2025
నారాయణపేట: అడిషనల్ కలెక్టర్‌కు డీడబ్ల్యూవో బాధ్యతలు

శిశుసంక్షేమ శాఖకు చెందిన ఓ జిల్లా అధికారిని అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పందించి, ఇది వరకు (డీడబ్ల్యూఓగా) కొనసాగిన జయబాయిని పోస్ట్ నుంచి తప్పించింది. నారాయణపేట జిల్లాకు ఈ మధ్యనే అడిషనల్ కలెక్టర్‌గా వచ్చిన సంచిత్ గంగ్వార్‌కు నారాయణపేట జిల్లా డీడబ్ల్యూఓ ఇన్‌ఛార్జ్ బాధ్యతలను ఇచ్చారు.
Similar News
News February 13, 2026
BIG BREAKING: మెదక్‌లో హంగ్

మెదక్ మున్సిపాలిటీ పరిధిలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. 32వ వార్డు ఏకగ్రీవం అవగా మిగతా వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు అనంతరం బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 2, బీఎస్పీ ఒక స్థానం సాధించాయి. 32 వార్డులు ఉండడంతో ఛైర్మన్ ఎన్నిక కోసం మ్యాజిక్ ఫిగర్ 17 కాగా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ఛైర్మన్ ఎవరు అవుతారన్న ఉత్కంఠ నెలకొంది.
News February 13, 2026
కల్తీపాల వ్యవహారంలో కుప్పం వాసులు.!

కుప్పం, పలమనేరు అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కల్తీ పాల తయారీ గుట్టురట్టైంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ పరిధిలో ప్రత్యేక దాడులు నిర్వహించిన పోలీసులు, మిల్క్ పౌడర్, పామ్ ఆయిల్‌తో కల్తీ పాలు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాలకు చెందిన నలుగురు ఈ వ్యవహారంలో ఉన్నట్లు గుర్తించారు. వీరు పాలను కర్ణాటకలో విక్రయించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
News February 13, 2026
BREAKING: నర్సాపూర్‌లో హంగ్

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 15 వార్డులకు గాను కాంగ్రెస్ 6, BRS 5, బీజేపీ 4 వార్డులు గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 8 ఎవరూ సాధించకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


