News March 21, 2025

నారాయణపేట జిల్లా పోలీసుల RECORD

image

నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ రికార్డ్ సృష్టించింది. చోరీకి గురైన, మిస్సైన 47 సెల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గత రెండు నెలల్లోనే రికవరీ చేశారు. సీఈఐఆర్ పోర్టల్‌తోపాటు లోకల్ ట్రాకింగ్ ద్వారా సెల్ ఫోన్ రికవరీ చేసి, బాధితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. సెల్ ఫోన్ చోరీకి గురైనా లేదా కనిపించకుండా పోయినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News April 22, 2025

866 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు

image

AP: ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీపై ఏపీపీఎస్సీ ఫోకస్ చేసింది. వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. నెల రోజుల్లో రోస్టర్ పాయింట్ల ఖరారు తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు అగ్రికల్చర్, రవాణా, మున్సిపల్, జైళ్లు తదితర శాఖల్లో ఖాళీలున్నాయి.

News April 22, 2025

ఎడ్లపాడు: హత్యాయత్నం కేసులో ఏడుగురికి 4 ఏళ్లు జైలు

image

హత్యాయత్నం కేసులో ఏడుగురు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.1000 విధిస్తూ కోర్టు తీర్పునిచ్చినట్లు సోమవారం ఎస్ఐ టి .శివరామకృష్ణ తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. 2021 తిమ్మాపురంలో జులై 30న జరిగిన 148/2021 కేసు తాలూకా నరసరావుపేట కోర్టు తీర్పునిచ్చిందన్నారు. భాదితుల తరఫున పీపీ బుజ్జి దంతా చారి వాదనలు వినిపించారు. వాదోపవాదాలు విన్న తర్వాత ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి మధుస్వామి తీర్పు వెలువరించారు.

News April 22, 2025

భీమవరం లాడ్జిలో పోలీసుల తనిఖీలు

image

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఓ రెసిడెన్షియల్ & లాడ్జిపై టూ టౌన్ సీఐ కాళీ చరణ్ తన సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో 9మంది అమ్మాయిలు, 9మంది అబ్బాయిలు ఉన్నారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. లాడ్జి నిర్వాహకుడు అంతం శ్రీను పరారైనట్లు స్థానికులు తెలిపారు.

error: Content is protected !!