News November 19, 2025
నారాయణపేట: పొగమంచులో ఓవర్‌టేక్ చేయొద్దు: ఎస్పీ

చలికాలంలో ఉదయం రోడ్లపై పొగమంచు పెరుగుతున్నందున రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉందని నారాయణపేట ఎస్పీ వినీత్ వాహనదారులను హెచ్చరించారు. వాహనాల వేగం తగ్గించి, సురక్షిత దూరం పాటించాలని సూచించారు. ముఖ్యంగా, పొగమంచులో ఓవర్‌టేక్ చేయడం పూర్తిగా మానుకోవాలని, జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News January 23, 2026
RS ప్రవీణ్ కుమార్‌కు సజ్జనార్ నోటీసులు

TG: బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని, 2 రోజుల్లో ఇవ్వకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఇవాళ ఉదయం మీడియా సమావేశంలో ప్రవీణ్ మాట్లాడుతూ ‘సజ్జనార్‌పై 7 ట్యాపింగ్ కేసులు ఉన్నాయి. ఆయనపైనే లోతైన విచారణ జరగాలి. ఆయన్ను సిట్ చీఫ్‌గా ఎలా నియమిస్తారు. ఆయన ఎలా ట్యాపింగ్ కేసును విచారిస్తారు?’ అని ప్రశ్నించారు.
News January 23, 2026
HNK: పరీక్ష హాల్‌లో సెల్‌ఫోన్.. ఆన్సర్ షీట్ వైరల్!

ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణలో అధికారుల పర్యవేక్షణ లోపం హనుమకొండ జిల్లాలో బట్టబయలైంది. SR ప్రైమ్ కళాశాలలో జరుగుతున్న ప్రాక్టికల్ పరీక్షా కేంద్రంలోకి ఓ విద్యార్థి నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్ తీసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా జవాబు పత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరగాల్సిన పరీక్షల్లో ఫోన్ లోపలికి ఎలా వచ్చిందో?
News January 23, 2026
V2V కోసం 30 GHz కేటాయించిన కేంద్రం

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇటీవల ప్రకటించిన <<18808386>>V2V టెక్నాలజీ<<>> కోసం 30 GHz రేడియో ఫ్రీక్వెన్సీని కేటాయించినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీని ద్వారా వాహనాలు ఇంటర్నెట్ అవసరం లేకుండా నేరుగా భద్రతా సమాచారాన్ని పంచుకుంటాయి. అన్ని వైపుల నుంచి వచ్చే ప్రమాదాలను ముందే గుర్తించి హెచ్చరిస్తుంది. ఈ టెక్నాలజీ కోసం ఒక్కో వాహనానికి రూ.5,000-7,000 ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.


