News November 19, 2025

నారాయణపేట: పొగమంచులో ఓవర్‌టేక్ చేయొద్దు: ఎస్పీ

image

చలికాలంలో ఉదయం రోడ్లపై పొగమంచు పెరుగుతున్నందున రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉందని నారాయణపేట ఎస్పీ వినీత్ వాహనదారులను హెచ్చరించారు. వాహనాల వేగం తగ్గించి, సురక్షిత దూరం పాటించాలని సూచించారు. ముఖ్యంగా, పొగమంచులో ఓవర్‌టేక్ చేయడం పూర్తిగా మానుకోవాలని, జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News January 22, 2026

గవర్నర్లు VS రాష్ట్ర ప్రభుత్వాలు

image

బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్లు VS రాష్ట్ర ప్రభుత్వాలుగా పరిస్థితి మారింది. TNలో RN రవి, కర్ణాటకలో థావర్ చంద్ అక్కడి ప్రభుత్వాలు రూపొందించిన ప్రసంగ పాఠాలను చదవడానికి నిరాకరిస్తూ సభనుంచి వెళ్లిపోయారు. అటు తామిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ రాజేంద్ర మార్చారని కేరళ CM విజయన్ ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలున్న STATESలో ఇవి దుమారాన్ని రేపుతున్నాయి. కాగా గవర్నర్ తీరుపై SCకి వెళ్లాలని కర్ణాటక నిర్ణయించింది.

News January 22, 2026

నవజాత శిశువుల్లో ఈ లక్షణాలున్నాయా?

image

శిశువు చేతులు, కాళ్లు చల్లగా ఉండటం, చర్మం పాలిపోయినట్టు లేదా కొద్దిగా నీలం రంగులో కనిపించడం వంటివి పసిపిల్లల్లో జలుబు లక్షణాలు. శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉన్నా, ఏడుస్తున్నప్పుడు వేగంగా శ్వాస తీసుకోవడం, తరచుగా తుమ్మడం, ముక్కు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. సమయానికి చికిత్స చేయకపోతే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.

News January 22, 2026

కదిరిలో మహిళ ఆత్మహత్య

image

కదిరిలో మున్ని అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నారాయణరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.