News May 7, 2025

నారాయణపేట: బాలికపై అత్యాచారం.. 14 రోజుల రిమాండ్

image

బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. SI బాలరాజు తెలిపిన వివరాలు.. NRPTజిల్లా కోస్గి పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను వికారాబాద్ జిల్లా దోమ మండలం మల్లేపల్లి వాసి రమేశ్ ప్రేమిస్తున్నానని చెప్పి మార్చి 5న తనవెంట తీసుకెళ్లాడు. 10రోజుల తర్వాత PSకు వచ్చి తాము పెళ్లి చేసుకుంటామని చెప్పాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రమేశ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

Similar News

News February 18, 2026

వయోవృద్ధులకు ప్రత్యేక కార్యక్రమాలు: కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లా వయోవృద్ధుల కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 21న ధవళేశ్వరంలోని శ్రీ గేదెల నూక రాజు కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. వృద్ధులు ఉత్పాదక జీవనం గడిపేలా వర్క్‌షాపులు నిర్వహిస్తామని, జిల్లాలోని వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News February 18, 2026

టెన్త్ అర్హతతో 28,636 ఉద్యోగాలు.. BIG UPDATE

image

ఇండియా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 28,636 GDS పోస్టులకు ఈ నెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. వీటిలో TGలో 608, APలో 1060 ఖాళీలున్నాయి. తాజాగా అప్లికేషన్ల సవరణకు అవకాశం కల్పిస్తూ పోస్టల్ శాఖ కరెక్షన్ విండోను ఓపెన్ చేసింది. అభ్యర్థులు రేపు సా.5 గంటల వరకు దరఖాస్తులను <>https://www.indiapost.gov.in/<<>> సైట్‌లో ఎడిట్ చేసుకోవచ్చు.

News February 18, 2026

కాకినాడ: దారుణం.. ఒంటిపై పెట్రోల్ పోసి..!

image

తునిలోని శ్రీరామ థియేటర్ సెంటర్‌లో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బైక్, సైకిల్ మెకానిక్స్ మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. వాగ్వాదం తీవ్రం కావడంతో బైక్ మెకానిక్.. సైకిల్ మెకానిక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు PSలో లొంగిపోగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.