News November 30, 2025
నారాయణపేట: రెండో విడత నామినేషన్లు నామమాత్రమే

నారాయణపేట మండలంలో ఆదివారం రెండో విడత నామినేషన్ల స్వీకరణ జరగింది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల సంఖ్య అంతంతమాత్రంగానే ఉండింది. మండలంలోని 28 గ్రామపంచాయతీలలో సర్పంచ్ పదవులకు 12 నామినేషన్లు, కేవలం 4 వార్డు సభ్యుల స్థానాలకు మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. పోటీకి కావాల్సిన ధ్రువపత్రాల సిద్ధీకరణలో అభ్యర్థులు నిమగ్నమవడంతో సోమవారం ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Similar News
News February 13, 2026
వేములవాడ మున్సిపాలిటీలో హంగ్

వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. మొత్తం 28 వార్డులకు కాంగ్రెస్ 13 చోట్ల జయకేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 8 స్థానాలు గెలుచుకోగా, బీఆర్ఎస్ 5 వార్డులకే పరిమితమైంది. రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మెజారిటీ స్థానాలు దక్కినప్పటికీ ఛైర్‌పర్సన్ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీకి మరొక కౌన్సిలర్ మద్దతు ఏర్పడింది.
News February 13, 2026
పాలమూరు: సీఎం సొంతగడ్డపై కాంగ్రెస్ హవా!

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో కాంగ్రెస్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. కొడంగల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులకు 10 కైవసం చేసుకొని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మద్దూరు 12 స్థానాలకు హోరాహోరి పోరు సాగినప్పటికీ 9వార్డులు గెలిచి ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. కోస్గి మున్సిపాలిటీలో 16 స్థానాలకు గాను ఇప్పటికే 8 గెలిచి కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగిస్తుంది.
News February 13, 2026
BREAKING: వైరా మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

వైరా మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 20 వార్డులకు గాను 11 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 2 వార్డులు ఇతరులు గెలిచారు. మిగతా వార్డులకు సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.


