News May 7, 2025

నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ధరలిలా..

image

నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు నేడు వరి ధాన్యం భారీగా తరలివచ్చింది. 4,820 క్వింటాళ్ల సోనా వరి ధాన్యం రాగా గరిష్ఠ ధర క్వింటాలకు రూ. 2,220, కనిష్ఠ ధర రూ. 1,350 పలికింది. తెల్ల జొన్న 29 క్వింటాళ్లు రాగా గరిష్ఠ ధర రూ. 3,926, కనిష్ఠ ధర 3,505 పలికింది. అలసందలు 23 క్వింటాళ్లు రాగా గరిష్ఠ ధర 6,305, కనిష్ఠ ధర రూ.6,055 పలికింది. పెసళ్ళు 4 క్వింటాళ్లు రాగా గరిష్ఠ ధర రూ. 7,477, కనిష్ఠ ధర 7,477 పలికింది.

Similar News

News February 13, 2026

GNT: క్వారీ తిరునాళ్లపై ఎస్పీ వకుల్ జిందాల్ నిఘా

image

వడ్లమూడి క్వారీ తిరునాళ్ల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ పరిసరాలు, ప్రభల ప్రదేశాలు, పొంగళ్ల స్థలాలను సందర్శించి అధికారులకు కీలక సూచనలు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని, భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు సిబ్బందిని కేటాయించాలని ఆదేశించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని స్పష్టం చేశారు.

News February 13, 2026

TU: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్

image

టీయూ కంప్యూటర్ సైన్స్&ఇంజినీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి దుర్గాప్రసాద్‌కు డాక్టరేట్ ప్రధానం చేశారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్&మిషిన్ లెర్నింగ్ బేస్డ్ క్వాలిటీ అష్యూరెన్స్ అప్రోచ్ ఫర్ ఈ-లెర్నింగ్ సిస్టమ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై డా.నందిని పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. శుక్రవారం జరిగిన వైవాలో ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా జగిత్యాల JNTU ఆచార్య నరసింహ సంతృప్తి వ్యక్తం చేశారు.

News February 13, 2026

కామారెడ్డి: ప్రభావం చూపని తెలంగాణ రాజ్యాధికార పార్టీ

image

బీసీల కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఆ పార్టీ అభ్యర్థులు పలు వార్డుల్లో పోటీ చేయగా వారి గెలుపు కోసం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా ఈ ఎన్నికల్లో నిరాశ తప్పలేదు.