News January 25, 2025
నార్నూర్: 7 రోజుల్లో ముగ్గురు మృతి

నార్నూర్ మండలంలో గత ఏడు రోజుల్లో ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది. మండల కేంద్రానికి చెందిన జాదవ్ విశ్వరక్షక్ ఈ నెల 17న శుక్రవారం ఉట్నూరులో పురుగు మందు తాగి మరణించారు. 23న గురువారం భీంపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ బన్నీ అనే విద్యార్థి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖోఖో పోటీలు ఆడుతూ గుండెపోటుతో మృతిచెందారు. శుక్రవారం మాన్కపూర్ గ్రామానికి చెందిన చంద్రకాంత్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Similar News
News February 14, 2025
యాపల్‌గూడ బడి రాష్ట్రంలోనే బెస్ట్ స్కూల్: కలెక్టర్

యాపల్‌గూడ ప్రాధమిక పాఠశాలలో గురువారం బాల వికాస్ వాటర్ ప్లాంట్, లైబ్రరీలను కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించారు.ఈ సందర్భంగా రీడింగ్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. రాష్ట్రంలోనే యాపల్‌గూడ బడి బెస్ట్ స్కూల్ అని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో DEO ప్రణీత, MEO నర్సయ్య, HM గంగయ్య, గ్రామ పెద్దలు, పేరెంట్స్, అధికారులు పాల్గొన్నారు.
News February 13, 2025
భీంపూర్‌లో చిరుత.. స్పందించిన అధికారులు

భీంపూర్ మండలంలోని నిపాని గ్రామ శివారులో చిరుత పులి కదలిక పై ఎఫ్ఎస్‌వో అహ్మద్ ఖాన్, ఎఫ్‌బీవో శ్రీనివాస్ స్పందించారు. నిపాని శివారులోని లింగారెడ్డి అనే రైతుకు చెందిన పంట చేనులో చిరుత పులి సంచారం సీసీ కెమెరాలో రికార్డయిందన్నారు. గురువారం పంట చేనుకు వెళ్లి పరిశీలించారు. రైతులెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News February 13, 2025
ADB: వ్యక్తిపై లైంగిక దాడి కేసు

తనను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ADB 1 టౌన్ CI సునీల్ కుమార్ వివరాలు.. తల్లిగారింటి వద్ద ఉంటున్న ఓ వివాహిత(24), శాంతినగర్‌కి చెందిన షేక్ ఆసిఫ్ 8నెలల పాటు సహజీవనం చేశారు. కాగా తనను ఆసిఫ్ మోసం చేశాడని, లైంగికంగా వేధించి తన వీడియోలు తీశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఆసిఫ్ తనను కులం పేరుతో దూషించాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసు నమోదైంది.